Drumstick Leaves : గుప్పెడు మునగాకుతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా..?

Drumstick Leaves : వేడి వేడి సాంబార్ లో మునక్కాయ ముక్కలు కనబడ్డాయంటే  నమిలి నమిలి పిప్పి మిగలే వరకు వదలము. అంత ఇష్టం అందరికి మునక్కాయలు రుచి అంటే. మునగకాయలు మాత్రమే కాకుండా ఆకులు కూడా శరీరానికి  కావలసిన ఎన్నో పోషకాలను అందజేస్తుందని చెప్పవచ్చు. శిలీంద్రాలు, బాక్టీరియా, కీటకాల సంహారిణిగా మునగాకు బాగా పనిచేస్తుంది. మునగాకులో పొటాషియం, బీటా కెరోటిన్, కాల్షియం, మాంసకృత్తులు, ఐరన్ ఎక్కువగా ఉంటుంది.

ఆకుకూరల్లా మునగాకును కూడా వివిధ రకాలుగా వండుకుంటారు. మునగాకుల్ని ఎండబెట్టి పొడిగా చేసి సూప్ లలోనూ ఇంకా కారం పొడి లాంటి వివిధ పద్ధతుల్లో ఉపయోగిస్తారు. అంతేకాకుండా మునగవేరు క్రిమిసంహారిగానూ, గనేరియా, సిఫిలిస్ వ్యాధులకు మంచి చికిత్సగా ఉపయోగపడుతుంది. ఆకులు, బెరడు, వంటివి కంటి సమస్యలకు మంచి మందుగా పనిచేస్తుంది. ఇప్పుడు మునగాకుతో అద్భుతమైన చిట్కాలు ఏంటో చూద్దాం.

Drumstick Leaves

కొంతమంది పిల్లలు రాత్రిళ్లు ఎక్కువగా పక్క తడుపుతుంటారు. అలాంటివారికి కప్పుడు మునగాకును కొద్దిగా పెసరపప్పుతో కలిపి కూరగా వండి పెడితే అద్భుత గుణాన్నిస్తుంది. అలాగే తాజా మునగాకు, ఆముదం రెండింటిని కలిపి ఉడికించాలి. ఇలా ఉకిడికించిన మిశ్రమంను ఒక బట్టలో వేసుకుని వాత నొప్పులు, కీళ్ల నొప్పులు, బెణుకు నొప్పులు ఉన్న ప్రాంతాల్లో కాపడం పెడితే ఆ నొప్పులన్ని తొందరగా తగ్గుతాయి.

అంతేకాకుండా గొంతుకు రెండువైపులా వచ్చే గవదబిళ్ళలపై మునగాకు ఉడికించిన మిశ్రమాన్ని చిన్న మూటగా కట్టి గోరువెచ్చగా ఉన్నపుడు పెట్టడం వల్ల గవదబిళ్ళలు తొందరగా తగ్గిపోతాయి. తాజామునగాను రసాన్ని తీసి శుభ్రమైన బట్టలో వడగట్టి ఆ రసాన్ని తేనెతో కలిపి  తాగుతూ ఉంటే గొంతు సమస్యలు, నోటి పుండ్లు, ముఖ్యంగా లివర్ సమస్యలు తొలగిపోతాయి.

మునగాకుల్లో విటమిన్స్, ఎమినోయాసిడ్స్, మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. క్యారెట్లు తింటే మాత్రమే వచ్చే విటమిన్ ఎ పది రెట్లు అధికంగా మునగాకు ద్వారా పొందొచ్చు. కళ్ల వ్యాధులకు సంబంధించిన మెడిసిన్ లో మునగాకును వాడతారు. మునగాకుతో లభించే కాల్షియం  పాలలో ఉన్న కాల్షియం తో పోలిస్తే మునగాకులోనే ఎక్కువ ఉంటుంది. గర్భిణులు, బాలింతలకు మునగాకును ఆకుకూరలు మాదిరిగానే కూర వండి పెడితే  వారికి అవసరం అయినా కాల్షియం, ఐరన్, విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి.

బాలింతలకు పాలు తక్కువైనపుడు మునగాకును రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల పాలు పెరుగుతాయి. గుప్పెడు మునగాకులను వంద మిల్లీలీటర్ల నీటిలో వేసి ఐదు నిమిషాలు ఆ నీటిని కాచి చల్లారనివ్వాలి. చల్లారిన నీటిలో నిమ్మరసం, మిరియాల పొడి, ఉప్పు కలిపి తాగడం ద్వారా శ్వాస సంబంధిత సమస్యలు తగ్గుతాయి. మరి గుప్పెడు మునగాకుల్లో ఇన్ని లాభాలు ఉన్నప్పుడు మీ ఆరోగ్యాన్ని పెంచుకోవడం కోసం మీ ఆహారాల్లో ఒక భాగంగా చేర్చుకోండి.

Share
Mounika

Recent Posts

Diabetes Health Tips : షుగ‌ర్ ఉన్న‌వారు పొర‌పాటున కూడా వీటిని అస్స‌లు తిన‌రాదు.. విషంతో స‌మానం..!

Diabetes Health Tips : నేటి త‌రుణంలో మ‌న‌లో చాలా మందిని బాధిస్తున్న అనారోగ్య స‌మ‌స్య‌ల‌ల్లో షుగ‌ర్ వ్యాధి ఒక‌టి.…

Tuesday, 30 April 2024, 11:56 AM

Metformin Tablets : మెట్ ఫార్మిన్ ట్యాబ్లెట్ల‌ను వాడుతున్న‌వారు సైడ్ ఎఫెక్ట్స్ రావొద్దంటే ఇలా చేయాలి..!

Metformin Tablets : మారిన జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్ల కార‌ణంగా త‌లెత్తుతున్న అనారోగ్య స‌మ‌స్య‌ల‌ల్లో షుగ‌ర్ వ్యాధి కూడా…

Tuesday, 30 April 2024, 7:48 AM

Ceiling Fan Speed : వేస‌విలో మీ ఫ్యాన్ ఎక్కువ వేగంగా తిర‌గ‌డం లేదా.. అయితే ఇలా చేయండి..!

Ceiling Fan Speed : వేస‌వి ఉష్ణోగ్ర‌త‌లు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ప్ర‌జ‌లు మ‌ధ్యాహ్న స‌మ‌యంలో బ‌య‌టికి రావ‌డ‌మే మానేసారు.…

Monday, 29 April 2024, 8:37 PM

Aquarium In Home : ఇంట్లో అక్వేరియం ఉంటే మంచిదేనా.. చేప‌ల‌ను ఇంట్లో పెంచ‌వ‌చ్చా..?

Aquarium In Home : మానవులకు పెంపుడు జంతువులతో చాలా కాలంగా అనుబంధం ఉంది. కొన్ని అధ్యయనాల ప్రకారం పెంపుడు…

Monday, 29 April 2024, 7:38 AM

Animals In Dreams : ఈ జంతువులు మీకు క‌ల‌లో క‌నిపిస్తున్నాయా.. అయితే మీకు త్వ‌ర‌లో అదృష్టం ప‌ట్ట‌బోతుంద‌ని అర్థం..!

Animals In Dreams : ప్రతి ఒక్కరు నిద్రపోతున్న సమయంలో కలలు కనడం సహజం. ఇందులో కొన్ని కలలు మన…

Sunday, 28 April 2024, 7:14 PM

Death Person Items : మ‌ర‌ణించిన వ్య‌క్తి యొక్క ఈ 3 వ‌స్తువుల‌ను ఎట్టి ప‌రిస్థితిలోనూ ఉప‌యోగించ‌కూడ‌దు..!

Death Person Items : మ‌నిషి పుట్టిన త‌రువాత మ‌ర‌ణించ‌క త‌ప్ప‌దు. పుట్టుక‌, చావు అనేవి మ‌న చేతుల్లో ఉండ‌వు.…

Sunday, 28 April 2024, 12:34 PM

Diabetes Health Tips : దీన్ని వాడితే అస‌లు డ‌యాబెటిస్ అన్న‌ది ఉండ‌దు..!

Diabetes Health Tips : మారిన జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్ల కార‌ణంగా త‌లెత్తుతున్న అనారోగ్య స‌మ‌స్య‌ల‌ల్లో షుగ‌ర్ వ్యాధి…

Sunday, 28 April 2024, 7:53 AM

Gents Bath : పురుషులు స్నానం చేసే స‌మ‌యంలో చేస్తున్న త‌ప్పులు ఇవే..!

Gents Bath : మ‌నం రోజూ అనేక ప‌నుల‌ను చేస్తూ ఉంటాము. మ‌నం చేసే ఈ ప‌నుల‌ల్లో మ‌న‌కు తెలిసీ,…

Saturday, 27 April 2024, 8:03 PM