Anushka Shetty : అనుష్క ఆస్తుల విలువ తెలిస్తే కళ్ళు తిరుగుతాయి.. ఇప్పటివరకు అనుష్క ఎంత ఆస్తి వెనకేసిందో తెలుసా..?

Anushka Shetty : నాగార్జున హీరోగా నటించిన సూపర్ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అనుష్క కేవలం ఒకే ఒక్క సినిమాతో అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంది. తన కెరీర్ లో కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేసి ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది అనుష్క. అరుంధతి, భాగమతి లాంటి సినిమాలు ఆమె స్థాయిని మరింత పెంచాయి. బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగా అనుష్క పేరు మారు మోగిపోయింది.

మొదట్లో అనుష్క పారితోషికం లక్షల్లో ఉండేది. అయితే అద్భుతమైన కథాంశం తో వచ్చిన అరుంధతి మూవీ బ్లాక్ బస్టర్ కావడంతో తన రెమ్యునరేషన్ అనూహ్యంగా కోటికి పెంచేసింది. అప్పట్లో అదే చాలా ఎక్కువ. ఆ తర్వాత మిర్చి, ఢమరుకం, బాహుబలి తర్వాత అనుష్క తన రెమ్యునరేషన్ నాలుగు కోట్ల వరకూ పెంచేసింది. తెలుగుతో పాటు తమిళ్ లో కూడా అనేక చిత్రాల్లో నటించింది. దాదాపు 47 చిత్రాలలో కనిపించిన అనుష్క అత్యధిక పారితోషికం పొందే దక్షిణ భారత నటీమణులలో ఒకరు.

Anushka Shetty

మరి ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్న అనుష్క ఆస్తులు విలువ ఎంత అంటూ సోషల్ మీడియాలో చర్చి మొదలైంది. అరుంధతి తర్వాత అనేక చిత్రాల్లో నటించిన అనుష్క భారీ మొత్తంలో పారితోషకం అందుకుంటూ చాలా ఆస్తులు సంపాదించింది. అనుష్క ఆస్థి దాదాపు 250కోట్లు ఉంటుందని సినీ వర్గాల్లో అంచనా. నగదు రూపంలో అసలు తన దగ్గర ఏమీ ఉంచుకోడానికి ఇష్టపడని  స్వీటీ ఎక్కువగా ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో దాస్తోందట. ఇక బెంగళూరులో విలాసవంతమైన భవంతులు, ఫామ్ హౌస్ లు అనుష్క పేరిట ఉన్నాయని సమాచారం.

అంతేకాదు బాహుబలి తర్వాత హైదరాబాద్ లో కొన్ని నివాస స్థలాలు కొన్నట్లు సమాచారం వినిపిస్తుంది. అయితే ప్రస్తుత మార్కెట్ వేల్యూ ప్రకారం ఆ స్థలాల ధర వందకోట్ల వరకూ ఉంటుందని అంచనా. ఆమె వద్ద గోల్డ్ కూడా పెద్ద మొత్తంలో ఉంటుందని అంచనా. అనుష్క దగ్గర ఉన్న బెంజ్ కారు, బిఎం డబ్య్లు కారు ఖరీదు కోటికి పైనే విలువ ఉంటుందని తెలుస్తోంది .

అయితే కొన్నాళ్లపాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న అనుష్క. మళ్లీ సినిమాలు ఒప్పుకోవడం మొదలుపెట్టింది. త్వరలో యూవీ క్రియేషన్స్ లో ఓ సినిమా చేయడానికి ఒప్పుకుంది అనుష్క. మిర్చి, భాగమతి విజయాల తర్వాత యూవీ క్రియేషన్స్ సంస్థలో ఆమె నటిస్తున్న హ్యాట్రిక్ సినిమా ఇది. ఇందులో ఆమె సరికొత్త లుక్ లో చెఫ్ గా కనిపించనుంది అని సమాచారం. ఈ సినిమాను తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం మొత్తం నాలుగు దక్షిణాది భాషల్లో  తెరకెక్కిస్తున్నారు.

Share
Mounika

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM