Aloe Vera Juice : మనలో చాలా మంది ఇళ్లలో అలోవెరా మొక్కను ఎక్కువగా పెంచుతారు. ఈ మొక్కనే మన వాడుక భాషలో కలబంద అని పిలుస్తాము. ఎక్కువ నీరు పొయ్యకపోయినా బతికే ఎడారి మొక్క ఇది. కానీ దానిలో ఉన్న ఔషధగుణాలు తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అలోవెరా మొక్క కాస్మొటిక్, ఫుడ్, స్కిన్ కేర్ ప్రొడక్ట్స్‌లో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. కలబందలో ఉండే గుజ్జు 96 శాతం నీటితోనే తయారవుతుంది. శతాబ్దాలుగా అలోవెరాను సంప్రదాయ ఔషధ మొక్కగా వాడుతున్నారు.
కలబంద రసంలో విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది మీ చర్మానికి చాలా మేలు చేస్తుంది. కలబంద రసం హైడ్రేటింగ్‌గా ఉంటుంది. ఇది మీ చర్మాన్ని లోపలి నుండి మెరిసేలా చేయడంలో సహాయపడుతుంది. దీన్ని రెగ్యులర్‌గా తాగడం వల్ల మొటిమలు తగ్గుతాయి. అంతేకాకుండా కలబంద మొక్కలో అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో జింక్, కాల్షియం, పొటాషియం, సోడియం వంటి విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. అలోవెరా జ్యూస్ తాగడం వల్ల ఈ పోషకాలన్నీ మీ శరీరానికి అందించి వ్యాధులతో పోరాడే శక్తిని పెంచుతుంది. చర్మంపై అలర్జీలను దూరం చేస్తుంది. కలబంద రసాన్ని రోజూ తాగడం వల్ల రక్తాన్ని శుద్ధి చేయడంతోపాటు కీళ్ల నొప్పులు వంటి సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. కలబంద రసం ప్రేగులలో నీటి శాతాన్ని పెంచడంలో బాగా సహాయపడుతుంది. తద్వారా మలబద్ధక సమస్య నివారిస్తుంది.
కలబంద రసంలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. విటమిన్ సి మన శరీరంలో రోగనిరోధక శక్తిని బలంగా ఉంచడంలో సహాయపడుతుంది. అలాగే గుండె జబ్బుల ప్రమాదాన్ని దరిచేరనివ్వదు. కలబంద పూర్తిగా సహజమైనది కాబట్టి ఇది మన ఆరోగ్యానికి అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుస్తుంది. అయితే కలబంద తినడం అనేది అందరికీ పని చేయకపోవచ్చు. మీరు కలబందను జ్యూస్ రూపంలో గాని లేక తినే ముందు ఒకసారి నిపుణులను సంప్రదించడం ఉత్తమం.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…