Sai Pallavi : సాయిపల్లవి.. ఫిదా మూవీతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టి తన నటనతో అందరినీ ఫిదా చేసింది. సినీ గ్లామర్ ప్రపంచంలో ఎంత పెద్ద హీరోయిన్ అయినప్పటికీ స్కిన్ షో తప్పదు. వీటికి దూరంగా ఉంటూ తన నటన ద్వారా అభిమానులను సొంతం చేసుకున్న సహజ నటి సాయి పల్లవి. హీరోలకు ఏ మాత్రం తీసిపోని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్ కూడా సాయి పల్లవే. కేవలం స్క్రీన్ పై ఆమెను చూడటానికే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారు. సాయి పల్లవిని టాలీవుడ్ లేడీ పవర్ స్టార్ అని ముద్దుగా పిలుస్తారు. ఇటీవల సాయి పల్లవి నటించిన విరాట పర్వం, గార్గి థియేటర్ లో కలెక్టన్స్ రాబట్ట లేకపోయినా.. పల్లవి నటనకు మాత్రం మంచి గుర్తింపు లభించింది.
ఇటీవల సాయి పల్లవి ఓ ఇంటర్వ్యూలో తన పర్సనల్ విషయాలను పంచుకుంది. న్యూస్ 18 కథనం ప్రకారం.. ఓ సినిమాలో రొమాంటిక్ సీన్స్ లేవని ఒప్పుకోవడంతో, సినిమా సగం షూట్ చేసాక లిప్ లాక్ సీన్ చేయాలంటూ సదరు దర్శకుడు సాయి పల్లవిపై ఒత్తిడి తీసుకువచ్చాడట. అయితే సాయి పల్లవి అందుకు ససేమిరా అందట. అలాంటి సీన్లలో చేయను అని ముందే చెప్పాను కదా అని సాయి పల్లవి వాదించిందట. ఈ సమయంలో ఆ సినిమా హీరో కలుగ చేసుకుని ఆమెను ఆ ఇబ్బంది నుంచి గట్టెక్కించాడట.
ఆమె చేయను అంటోంది కదా.. ఎందుకు ఒత్తిడి చేస్తారు. ఆమె వద్దు అనుకుంటున్నపుడు వదిలేయమని డైరెక్టర్ కు సలహా ఇచ్చాడట. మళ్లీ ఆమె మీటూ పేరిట బయట చెబితే అందరం ఇబ్బందుల్లో పడతాం అని చెప్పుకొచ్చాడట. దీంతో కన్విన్స్ అయిన డైరెక్టర్ సాయి పల్లవిని ఇక ఇబ్బంది పెట్టలేదని చెప్పుకొచ్చింది. రొమాన్స్ అనే కాదు.. అన్ని విషయాల్లోనూ సాయి పల్లవి తన పరిధి మేరకే ప్రవర్తిస్తుంది. తన కుటుంబ సభ్యులు తన సినిమాని ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడగలగాలి అని సాయి పల్లవి భావిస్తుంది. తనకు నచ్చిన సినిమాలు మాత్రమే చేస్తూ.. అందరి చేత శభాష్ అనిపించుకుంది ఈ హైబ్రిడ్ పిల్లా.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…