Meena : ఒకప్పుడు స్టార్ హీరోలు అందరితో కలిసి నటించి అలరించిన అందాల ముద్దుగుమ్మ మీనా. చైల్డ్ ఆర్టిస్ట్ గా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన మీనా.. ఆ తర్వాత తిరుగులేని ఇమేజ్ ను సాధించింది. ఆమె తోటి హీరోయిన్స్ అంతా క్యారెక్టర్ రోల్స్ చేసుకుంటూ బిజీ అయిపోయారు. కానీ మీనా మాత్రం ఇంకా హీరోయిన్ గా అవకాశాలు కొట్టేస్తోంది. రీసెంట్ గా దృశ్యం 2తో అలరించింది ఈ బ్యూటీ. ఇప్పటికే అదే సౌందర్యంతో చూడచక్కని రూపంతో ఆకట్టుకుంటున్నారు మీనా. మీనా 1976 సెప్టెంబర్ 16న మద్రాసులో జన్మించారు. 2009లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ విద్యాసాగర్ ని మీనా వివాహం చేసుకుంది. వీరికి 2011లో నైనికా అనే ఓ అమ్మాయి పుట్టింది.

మీనా మరోసారి తల్లి కాబోతుందనే వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాజాగా మీనా పోస్ట్ చేసిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో మీనా గర్భవతిగా కనిపిస్తుంది. చాలా మారిపోయింది. అప్పట్లో ఈ గెటప్ వేయడం చాలా సులభంగా ఉండేది. దీన్ని కవర్ చేసేందుకు హెవీ చీరలు కట్టుకునేదాన్ని. కానీ ప్రస్తుతం ఈ గెటప్‌కు, ఈ పాత్రకు చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు. షిఫాన్ చీరలు కట్టుకున్నా చూడటానికి చాలా నాచురల్‌గా ఉంది.. అంటూ వీడియోకు క్యాప్షన్‌గా రాసుకొచ్చింది. అంటే రియల్‌గా కాకుండా రీల్ లైఫ్‌లోనూ గర్భవతిగా కనిపించనుంది మీనా.
మీనా ఒకవైపు పలు పాత్రలు చేస్తూ సందడి చేస్తుండగా.. ఆమె కూతురు కూడా అలరిస్తోంది. విజయ్ హీరోగా నటించిన పోలీసోడు చిత్రంలో అతనికి కూతురిగా నటించింది నైనిక. ఆ తర్వాత భాస్కర్ ఒరు రాస్కెల్ లో అరవింద్ స్వామితోనూ నటించింది. ఇక రెండో ఇన్నింగ్స్ షురూ చేశాక వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. ప్రస్తుతం రజనీకాంత్ అన్నాత్తేలో నటిస్తోంది. మరోవైపు విక్టరీ వెంకటేష్ తో కలిసి దృశ్యం 2 సినిమాలో కూడా నటించింది. తరువాత కూడా అనేక సినిమా ఆఫర్లను మీనా అందుకుంటూ వస్తోంది.