Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఆయనను నటుడిగానే కాకుండా వ్యక్తిత్వం ఉన్న మనిషిగా చాలా ఇష్టపడుతుంటారు. సినిమాల ద్వారా కోట్లు సంపాదించి రాయల్ లైఫ్ ను మెయింటెయిన్ చేసే సత్తా ఉన్న పవన్ కళ్యాణ్. రాజకీయాలలోకి వచ్చి ప్రజలకు తన వంతు సేవ చేస్తున్నారు. తాజాగా జనసేనాని పవన్ కళ్యాణ్ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో జనసేన కౌలు రైతు భరోసా యాత్రలో పాల్గొన్న విషయం తెలిసిందే.

పవన్ రావడంతో జనసైనికులతో పశ్చిమగోదావరి జిల్లా నిండిపోయింది . పవన్ ను చూడడానికి అభిమానులు పోటెత్తారు. ఇక దీంతో పోలీసులు ఎంత బందోబస్త్ పెట్టినా వారిని ఆపడం కష్టతరం అయ్యింది. అయితే ఈ నేపథ్యంలోనే పవన్ పోలీసుల బందోబస్త్ మధ్య వెళ్తుండగా జనసందోహం ఎక్కువ కావడంతో ఒక పోలీస్ అదుపుతప్పి పడిపోయాడు. పవన్ స్పందించి అంతమందిని దాటుకొని పోలీసును లేపి.. జాగ్రత్త చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ వీడియోపై పవన్ అభిమానులు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. అదీ.. పవన్ వ్యక్తిత్వమంటే.. అని అంటున్నారు.
https://twitter.com/SKNonline/status/1517845451877232640
ఇక సినిమాల విషయానికి వస్తే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీసెంట్‌గా భీమ్లా నాయక్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. నెక్స్ట్ మూవీ హరి హర వీర మల్లు. ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. పీరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రం క్రిష్ దర్శకత్వంలో రూపొందుతోంది. ఏఎం రత్నం నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ పీరియాడిక్ డ్రామాలో పవన్ దొంగ పాత్రలో నటిస్తున్నారు. ఇక ఇదిలా ఉండగా బాబాయ్ నిర్మాణంలో తన సినిమా గురించి నోరు విప్పాడు రామ్ చరణ్. ఒక కథ కుదిరిన రోజు.. అది తనకు సరిపోతుంది అనుకుంటే పవన్ బాబాయ్ నిర్మాణంలో కచ్చితంగా సినిమా చేస్తాను అని తాజాగా చెప్పుకొచ్చాడు రామ్ చరణ్.