Bheemla Nayak : భీమ్లా నాయక్ మూవీని మిస్ చేసుకున్న స్టార్ హీరోలు ఎవరో తెలుసా..?

Bheemla Nayak : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ వస్తుందంటే చాలు ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంటారు. మూవీ ఫస్ట్ లుక్ వచ్చినప్పటి నుంచి రిలీజ్ అయ్యే వరకు ఫ్యాన్స్ హంగామా మాములుగా ఉండదు. అలా కొంత గ్యాప్ తరువాత భీమ్లా నాయక్ అంటూ పవన్ నుంచి మరో మాస్ మూవీ రావడంతో బాక్సాఫీస్‌ షేక్ అయింది. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా న‌టించిన భీమ్లా నాయ‌క్ సినిమాకు సాగ‌ర్ కే చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా రానా ముఖ్య‌మైన పాత్ర‌లో న‌టించారు. ఈ సినిమాలో నిత్యా మీన‌న్, సంయుక్త మీన‌న్ హీరోయిన్లుగా న‌టించారు. అంతే కాకుండా ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే అందించ‌డంతోపాటు మాట‌లు కూడా రాశారు. ఈ సినిమాను మ‌ల‌యాళ చిత్రం అయ్య‌ప్ప‌నుమ్ కోషియంకు రీమేక్ గా తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే.

అయితే భీమ్లా నాయ‌క్ క‌థ మొదట టాలీవుడ్ లో ప‌లువురు టాప్ హీరోల వ‌ద్ద‌కు వెళ్లి చివరకు ప‌వ‌న్ క‌ల్యాణ్ వ‌ద్ద‌కు చేరింద‌ట‌. ఈ క‌థ ప‌వ‌న్ క‌ల్యాణ్ కు బాగా సూట్ అవుతుంద‌ని త్రివిక్ర‌మ్ ఒప్పించారట‌. ఇక ఈ సినిమాను రిజెక్ట్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరోలు ఎవ‌రో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఈ క‌థ బాల‌కృష్ణ వ‌ద్ద‌కు వెళ్లింద‌ట‌. కానీ బాల‌య్య ఈ సినిమా క‌థ త‌న‌కు సూట్ అవ్వ‌ద‌ని నో చెప్పారట‌. ఆయ‌న రీమేక్‌లు కూడా చేయ‌రు. క‌నుక ఈ క‌థ‌ను రిజెక్ట్ చేశారు. ఇక వ‌రుస‌గా రీమేక్ లు చేస్తూ హిట్స్ అందుకుంటున్న‌ విక్టరీ వెంక‌టేష్ వ‌ద్ద‌కు కూడా ఈ సినిమా కథ వెళ్లింద‌ట‌. కానీ వెంక‌టేష్ కూడా ఈ సినిమాను చేసేందుకు ఒప్పుకోలేదట. దీంతో మాస్ మ‌హారాజ్ ర‌వితేజ వద్ద‌కు కూడా ఈ సినిమా స్టోరీ వెళ్లడంతో బిజీ షెడ్యూల్ వ‌ల్ల ర‌వితేజ కూడా ఈ సినిమాకు నో చెప్పారు.

Bheemla Nayak

దీంతో చివ‌రగా భీమ్లా నాయ‌క్ క‌థ న‌చ్చ‌డంతో త్రివిక్ర‌మ్.. ప‌వ‌న్ క‌ల్యాణ్ ను మీట్ అయ్యారు. క‌థ న‌చ్చ‌డంతో ప‌వ‌న్ కూడా వెంట‌నే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. ఇక ఫిబ్ర‌వ‌రి 25న విడుద‌లైన ఈ సినిమాకు బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్ వ‌చ్చింది. విడుద‌లైన మూడు రోజుల‌కే ఈ సినిమా వంద కోట్ల క్ల‌బ్ లో చేరి పవర్ స్టార్ బ్లాక్ బస్టర్ లిస్ట్ లో చేరిపోయింది. ప్రస్తుతం పవన్ క్రిష్ డైరెక్షన్ లో హరి హర వీరమల్లు, అలాగే హరీష్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్ సింగ్ చిత్రాల్లో నటిస్తున్నారు.

Share
Usha Rani

నా పేరు ఉషారాణి. పుస్తకాలు చదవడం, సినిమాలు చూడడం అంటే ఇష్టం. సాహిత్యంపై నాకు కొంత అవగాహన ఉండడంతో రాయాలి అనే ఆసక్తి పెరిగింది. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ లో కంటెంట్ రైటర్ గా చేస్తున్నాను.

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM