IND Vs ZIM : హరారే వేదికగా జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో జింబాబ్వేపై భారత్ ఘన విజయం సాధించింది. ఆ జట్టు నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని భారత్ సునాయాసంగా ఛేదించింది. భారత బౌలర్ల ధాటికి జింబాబ్వే బ్యాట్స్‌మెన్ విలవిలలాడిపోయారు. ఈ క్రమంలోనే ఆ జట్టు తక్కువ స్కోర్‌కే చాప చుట్టేసింది. దీంతో ఆ లక్ష్యాన్ని భారత్ అలవోకగా ఛేదించింది. వికెట్ నష్టపోకుండా భారత బ్యాట్స్‌మెన్ లక్ష్యాన్ని ఛేదించారు. దీంతో జింబాబ్వేపై భారత్ 10 వికెట్ల తేడాతో గెలుపొందింది.
మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా.. జింబాబ్వే బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలోనే జింబాబ్వే జట్టు 40.3 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టు బ్యాట్స్‌మెన్‌లలో బ్రాడ్ ఇవాన్స్ (33 నాటౌట్), రిచర్డ్ ఎన్‌గరవ (34) తప్ప ఎవరూ రాణించలేదు. ఇక భారత బౌలర్లలో దీపక్ చాహర్, ప్రసిధ్ కృష్ణ, అక్షర్ పటేల్‌లు తలా 3 వికెట్లను పడగొట్టారు. అలాగే మహమ్మద్ సిరాజ్‌కు 1 వికెట్ దక్కింది.
అనంతరం బ్యాటింగ్ చేసిన భారత్ ఆది నుంచి దూకుడుగా ఆడింది. ఈ క్రమంలోనే వికెట్ కూడా నష్టపోకుండా 30.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. 192 పరుగులు చేసి విజయం సాధించింది. భారత ఓపెనర్లు శిఖర్ ధావన్, శుబమన్ గిల్‌లు జింబాబ్వే బౌలర్లను పరుగెత్తించారు. బౌండరీల మీద బౌండరీలను బాదారు. దీంతో శిఖర్ ధావన్ 113 బంతుల్లో 9 ఫోర్లతో 81 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా.. 72 బంతుల్లో శుబమన్ గిల్ 10 ఫోర్లు, 1 సిక్సర్‌తో 82 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. జింబాబ్వే బౌలర్లు భారత బ్యాట్స్‌మెన్‌పై ఏమాత్రం ప్రభావం చూపించలేపోయారు. భారత్ నుంచి వచ్చిన లిస్ట్ ఎ ప్లేయర్లతోనూ జింబాబ్వే ఆడి గెలవలేకపోయింది. ఇక తొలి వన్డే మ్యాచ్‌లో విజయం సాధించడంతో భారత్ సిరీస్ లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ సిరీస్‌లో రెండో వన్డే ఇదే వేదికపై ఈ నెల 20వ తేదీన మధ్యాహ్నం 12.45 గంటలకు ప్రారంభం కానుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…