Balakrishna : ఏపీలో సంచలనం రేపిన ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఘాటుగా స్పందించారు. ఎంపీ గోరంట్ల మాధవ్ ఓ మహిళతో అసభ్యంగా మాట్లాడారంటూ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాట్సాప్ గ్రూపుల నుంచి బయటకు వచ్చిన వీడియో.. అధికార వైసీపీలో ప్రకంపనలు రేపింది. ఈ వీడియోపై విచారణ చేపట్టిన పోలీసులు.. వైరల్ అవుతున్న వీడియో ఒరిజనల్‌ది కాదని ఎడిట్ చేసి ఉండవచ్చని అనంతపురం ఎస్పీ ఫక్కీరప్ప చెప్పిన సంగతి తెలిసిందే.
తాజాగా ఎంపీ మాధవ్ వీడియోపై హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ స్పందించారు. సత్యసాయి జిల్లా లేపాక్షిలో జరిగిన బాదుడే బాదుడు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. భారీగా తరలివచ్చిన కార్యకర్తల నడుమ ఆయన మాట్లాడుతూ మాధవ్ ఘటనపై తొలిసారిగా స్పందించారు. మన ఎంపీ విచరక్షణా రహితంగా.. సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తించారు. ఒక్కసారి ఆలోచించుకోండి. ఇలాంటి ఆయన సిగ్గులేకుండా జాతీయ వందనం చేయడానికి వచ్చాడు.
ఆయనను మన వాళ్లు (టీడీపీ నేతలు) అందరూ అడ్డుకున్నారు. ఎంతోమంది మీపై (కార్యకర్తలు) కేసులు పెట్టారు. వాళ్ల లాఠీల జులుం మీపై చూపించారు. వాళ్లు ఎన్ని ఇబ్బందులు పెట్టినా వదిలే ప్రసక్తే లేదు. ప్రజలు అందరూ బయటకు రావాలి. కేవలం పార్టీ కార్యకర్తలే కాదు. ప్రపంచ చరిత్ర తిరగరాసేందుకు ముందుకు రావాలి.. అంటూ బాలకృష్ణ పిలుపునిచ్చారు. ఆయన మాట్లాడుతున్నంత సేపు టీడీపీ కార్యకర్తలు, అభిమానులు ఈలలతో హోరెత్తించారు. జై బాలయ్య.. జైజై బాలయ్య.. అంటూ నినాదాలు చేశారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…