Chanti Movie : సినిమా రంగంలోకి నటుల వారసులు ఎంతో మంది వచ్చారు. కానీ వారిలో కేవలం కొందరు మాత్రం తమ టాలెంట్‌తో నిలదొక్కుకున్నారు. చాలా కాలం నుంచి అలా వారు ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. అలాంటి వారిలో నటుడు వెంకటేష్ ఒకరు. విక్టరీని ఆయన ఇంటి పేరుగా మార్చుకున్నారు. చేసిన తొలి సినిమాతోనే ఘన విజయం సాధించారు. ఇక వెంకటేష్ తన కెరీర్‌లో ఎన్నో వైవిధ్యభరితమైన చిత్రాల్లో నటించారు. వాటిల్లో చంటి ఒకటి. ఈ మూవీలో వెంకీ అమాయకుడి పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు.
వెంకటేష్, మీనా కాంబినేషన్ లో రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో వచ్చిన చంటి సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా విడుదలై దాదాపుగా 30 సంవత్సరాలు అయింది. ఈ సినిమాలో వెంకటేష్, మీనా అద్భుతంగా నటించారు. ఈ సినిమా తమిళంలో హిట్టయిన చిన్న తంబీ సినిమాకు రీమేక్. చంటి సినిమాలో వెంకటేష్ అమాయకమైన పల్లెటూరి యువకుని పాత్రలో నటించారు. ఈ సినిమాలో మొదటగా హీరోగా రాజేంద్ర ప్రసాద్ ని అనుకున్నారట. ఆ సమయంలోనే చిన్న తంబి సినిమాను రామానాయుడు చూశారట.
ఈ సినిమా రీమేక్ రైట్స్ ను కేఎస్ రామారావు కొనుగోలు చేశారు. ఈ సినిమాలో హీరోగా చేయటానికి రాజేంద్ర ప్రసాద్ ని ఒప్పించారట. ఈ సినిమా వెంకటేష్, సురేష్ బాబు కూడా బాగా నచ్చడంతో కె.ఎస్.రామారావు.. రవిరాజా పినిశెట్టిని వెంకటేష్ హీరోగా పెట్టి చేయమని చెప్పారట. అయితే రవిరాజా పినిశెట్టి రాజేంద్ర ప్రసాద్ కి మాట ఇచ్చాను చేస్తే ఆ హీరో తోనే చేస్తాను అని పట్టుబట్టారు అట. అప్పుడు చిరంజీవి రవిరాజా పినిశెట్టిని ఒప్పించటంతో వెంకీ మీనాలతో ఈ సినిమా తెరకెక్కింది. అలా రాజేంద్ర ప్రసాద్ ఈ మూవీలో నటించలేదు. కానీ ఆయన చేసి ఉంటే కెరీర్ మరోలా ఉండేది.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…