Mukesh Ambani Cars : ముకేష్ అంబానీ వ‌ద్ద ఉన్న అత్యంత ఖ‌రీదైన 7 కార్లు ఇవే.. వీటి ధ‌ర ఎంతో తెలుసా..?

Mukesh Ambani Cars : ముకేష్ అంబానీ.. ఈయ‌న గురించి అంద‌రికీ తెలిసిందే. రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ అధినేత‌. ప్ర‌పంచంలోని కుబేరుల్లో ఒక‌డు. రిల‌య‌న్స్ చ‌మురు మొద‌లుకొని, జియో, ఎల‌క్ట్రానిక్స్‌, ఫ్రెష్.. ఇలా ఎన్నో రంగాల్లో వ్యాపారాల‌ను కొన‌సాగిస్తూ దూసుకెళ్తున్నారు. తండ్రి ధీరూభాయ్ అంబానీ నుంచి వ‌చ్చిన ఆస్తిని ఈయ‌న ఎన్నో రెట్లు పెంచుకోగా.. ఈయ‌న త‌మ్ముడు అనిల్ అంబానీ మాత్రం దివాళా తీశాడు. ఇక ముకేష్ అంబానీ భార్య నీతా అంబానీ గురించి కూడా అంద‌రికీ తెలిసిందే. ఆమె రిల‌య‌న్స్ ఫౌండేష‌న్ సేవా కార్య‌క్ర‌మాల‌తోపాటు ఐపీఎల్ టీమ్ ముంబై ఇండియ‌న్స్ బాధ్య‌త‌ల‌ను కూడా చూస్తుంటుంది. అయితే ముకేష్ అంబానీ అత్యంత సంప‌న్నుడు క‌నుక ఆయ‌న ద‌గ్గ‌ర స‌హ‌జంగానే ఏదైనా స‌రే అత్యంత విలువైన వ‌స్తువులు ఉంటాయి. అలాంటి వాటిల్లో కార్లు కూడా ఒక‌టి.

ముకేష్ అంబానీ ద‌గ్గ‌ర అత్యంత విలువైన కార్లు 7 వ‌ర‌కు ఉన్నాయి. వాటిని ఆయ‌న త‌ర‌చూ ఉప‌యోగిస్తుంటారు. ముకేష్ అంబానీకి కార్లంటే ఇష్టం. అందువ‌ల్ల ఆయ‌న మార్కెట్‌లోకి వ‌చ్చే విలాస‌వంత‌మైన కార్ల‌ను కొంటుంటారు. ముంబైలోని ఆయ‌న భ‌వంతిలో కార్ పార్కింగ్ కోసం చాలానే స్థ‌లం ఉంది. అందువ‌ల్ల ఎన్ని కార్లు ఉన్నా ఆయ‌న‌కు పెద్ద‌గా ఇబ్బందేమీ ఉండ‌దు. ఇక ఆయ‌న ద‌గ్గ‌ర ఉన్న అత్యంత ఖ‌రీదైన 7 కార్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

Mukesh Ambani Cars

ముకేష్ అంబానీ ద‌గ్గ‌ర మెర్సిడెస్ కంపెనీకి చెందిన ఓ విలాస‌వంత‌మైన కారు ఉంది. దాని ఖ‌రీదు సుమారుగా రూ.10 కోట్ల వ‌ర‌కు ఉంటుంది. మెర్సిడెస్ బెంజ్ ఎస్ గార్డ్ 600 అనే పేరున్న ఈ కార్ బుల్లెట్ ప్రూఫ్‌ను క‌లిగి ఉంటుంది. అంబానీలు ఎక్కువ‌గా ఈ కంపెనీ కార్ల‌నే ఉప‌యోగిస్తుంటారు. ఇక దీని త‌రువాత రూ.6.95 కోట్ల విలువైన రోల్స్ రాయ్స్ కుల్లిన‌న్ కారు కూడా ఉంది. అలాగే రూ.5.50 కోట్ల విలువైన ఫెరారీ 812 సూప‌ర్ ఫాస్ట్‌, రూ.3.85 కోట్ల విలువైన బెంట్లీ బెంట‌య‌గ‌, రూ.2.62 కోట్ల విలువైన బీఎండ‌బ్ల్యూ ఐ8, రూ.2.14 కోట్ల విలువైన మెర్సిడెస్ ఏఎంజీ జి63 కార్లు ఉన్నాయి. వీటితోపాటు రూ.1.50 కోట్ల విలువైన టెస్లా మోడ‌ల్ ఎస్100 డి కారు కూడా ఉంది. ఇవ‌న్నీ ముకేష్ అంబానీ వాడే కార్లు. వీటి మొత్తం విలువ సుమారుగా రూ.33 కోట్ల వ‌ర‌కు ఉంటుంది. ఈ క్ర‌మంలోనే ఆయ‌న కార్ల క‌లెక్ష‌న్ వార్త సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ గా మారింది.

Share
IDL Desk

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM