సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికే ఎంతో మంది అడుగు పెట్టి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. చాలా మంది ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండానే వచ్చి స్వయం కృషితో ఎదిగారు. ఇక కొందరు తమ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌తో వచ్చి స్టార్లుగా మారారు. అయితే కొందరు మాత్రం డబ్బు, ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నప్పటికీ స్టార్లుగా ఎదగలేకపోయారు. అయితే చాలా వరకు హీరోలు మాత్రం స్టార్స్ అయ్యారు. కానీ సినిమా నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చినప్పటికీ హీరోలు, ఇతర నటులకు చెందిన కుమార్తెలు మాత్రం హీరోయిన్స్ కాలేకపోయారు. వారెవరంటే..
అక్కినేని నాగేశ్వరావు మనవరాలు, నాగార్జున మేనకోడలైన సుప్రియ యార్లగడ్డ మొదటి సినిమాను పవన్ కళ్యాణ్ తో కలిసి చేసింది. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీలో హీరోయిన్ గా నటించి ఇండస్ట్రీకి పరిచయం అయింది. అయితే ఈ సినిమా తర్వాత ఈమెకి అనుకున్న స్థాయిలో హీరోయిన్ గా ఛాన్స్ లు రాలేదు. ఇప్పుడు మంచి సినిమాల్లో అదిరిపోయే పాత్రలలో నటిస్తోంది. ఇక సూపర్ స్టార్ కృష్ణ రెండో కూతురు, మహేష్ బాబు చిన్నక్క మంజుల కూడా హీరోయిన్‌గా అడుగుపెట్టాలని ఎన్నో ఆశలు పెట్టుకుంది. అప్పట్లో బాలకృష్ణతో ఒక సినిమా ఓకే కూడా అయింది. కానీ కృష్ణ అమ్మాయి కాబట్టి ఆమెని వేరే వాళ్ళ పక్కన ఊహించుకోలేమంటూ ప్రేక్షకుల నుండి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం కావడంతో ఆమె ఆశలు అడియాశలయ్యాయి. కానీ మంజుల కొన్ని సినిమాల్లో మంచి క్యారెక్టర్స్ చేసింది.
యూనివర్సల్ హీరో అయిన కమల్ హాసన్ కు ఇద్దరు ముద్దుల కూతుర్లు ఉన్నారు. ఇందులో ఇప్పటికే హీరోయిన్‌గా సత్తా చాటుతున్న శృతి హాసన్ కెరియర్ మొదట్లో ఎన్నో ప్లాప్ లను చూసింది. ఇక కమల్ 2వ కూతురు అక్షర హాసన్ కూడా కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటించినా ఉపయోగం లేదు. ఈమె హీరోయిన్‌గా కొనసాగలేకపోయింది. ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉంటోంది. అలాగే మెగా ప్యామిలీ నుంచి మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారికను మాత్రం ప్రేక్షకులు హీరోయిన్ గా ఆదరించలేదు. నిహారిక ఒక మనసు సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయి ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించినా కూడా ఆమెని హీరోయిన్ గా అంగీకరించలేక పోయారు.
అలాగే మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి పూర్తి స్థాయిలో హీరోయిన్‌గా నటించక పోయినా నటిగా మాత్రం మంచి సత్తా చాటుతోంది. ఎందుకో పూర్తి స్థాయిలో నటిగా ఎక్కువ సినిమాలు చేయలేకపోతోంది. తమిళ స్టార్ నటుడు శరత్ కుమార్ ముద్దుల తనయ వరలక్ష్మి కూడా హీరోయిన్‌గా సత్తా చాటాలని చూసినా కొన్ని సినిమాల తర్వాత ఎందుకో హీరోయిన్ గా రాణించలేకపోయింది. ఇక ఇప్పుడు పూర్తి స్థాయిలో విలన్ గా, మంచి మంచి పవర్‌పుల్ రోల్స్ ప్లే చేస్తోంది. క్రాక్ లో కూడా రవితేజని ఢీకొట్టింది. ఒకప్పుడు హీరోగా నటించిన విజయ్ కుమార్ కు ముగ్గురు కూతుళ్లు వనిత, ప్రీతి, శ్రీదేవిలు ఉన్న విషయం విదితమే. అయితే వీరు హీరోయిన్స్‌గా తమ అదృష్టాన్ని పరీక్షించు కున్నారు. కానీ తక్కువ సినిమాలే చేశారు.
ఇక యాక్షన్ కింగ్ అర్జున్ కుమార్తె ఐశ్వర్య కూడా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈమె విశాల్ హీరోగా చేసిన ధీరుడు అనే సినిమాతో పరిశ్రమలోకి అరంగేంట్రం చేసింది. ఈ సినిమా ప్లాప్ అవ్వడంతో ఆ తర్వాత అనుకున్న స్థాయిలో ఈమెకి ఛాన్సులు రాలేదు. అలాగే హీరో రాజశేఖర్ కూతుళ్లు శివాని, శివాత్మికలను కూడా ప్రేక్షకులు హీరో రాజశేఖర్, జీవిత కూతుర్లుగానే చూస్తూ వీళ్ళని ఆదరించలేకపోతున్నారు. అయినా వాళ్ళ ప్రయత్నాలు కొనసాగిస్తూ సినిమాలు చేస్తున్నారు. అయితే నటులకు చెందిన కొడుకులు మాత్రం హీరోలుగా రాణిస్తున్నారు. కానీ కుమార్తెలు మాత్రం హీరోయిన్స్ కాలేకపోతున్నారు. అందుకు కారణం ఆయా నటులకు ఉండే అభిమానులే అని చెప్పవచ్చు. నటులకు చెందిన కొడుకులు అయితే ఓకే. వాళ్లని ఆదరిస్తారు. కానీ కుమార్తెలను మాత్రం హీరోయిన్స్‌గా చూడడం లేదు. అందుకనే వారు హీరోయిన్స్ కాలేకపోతున్నారు. మరి ఈ ట్రెండ్ ఇక ముందైనా మారుతుందో లేదో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…