Venu Thottempudi : రెండు దశాబ్దాల క్రితం స్వయంవరంతో ఫిల్మ్ ఎంట్రీ ఇచ్చాడు వేణు తొట్టెంపూడి. అటు యూత్ ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ సంపాదించుకున్నాడు వేణు. హీరోగా చేసింది కొన్ని సినిమాలే అయినా కమర్షియల్ ఫార్ములాకి దూరంగా క్లీన్ ఎంటర్ టైనర్స్ లో నటించాడు. ముఖ్యంగా చిరునవ్వుతో క్యారెక్టరైజేషన్ ఇప్పటికీ మంచి వ్యక్తిత్వ వికాసానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. స్వయంవరం, పెళ్ళాం ఊరెళితే, హనుమాన్ జంక్షన్ ఎప్పుడు టీవీలో వచ్చినా హ్యాపీగా ఇంటిల్లిపాదీ చూసి ఎంజాయ్ చేస్తారు.
ముఖ్యంగా వేణు కామెడీ టైమింగ్ కు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆ తర్వాత వరుస ఫ్లాపులతో వేణు సినిమాలకు మాయమయ్యాడు. ఆ తరువాత దాదాపు పది ఏళ్ళు అవుతున్నా మళ్ళీ తెరపై కనిపించలేదు. 2012లో తిరిగి దమ్ములో కనిపించాడు కానీ పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే ఇటీవల వేణు.. రవితేజ నటించిన రామారావు ఆన్ డ్యూటీ లో పోలీస్ గా కనిపించాడు. ఇదిలా ఉండగా ఇప్పుడు వేణు భార్య, పిల్లల గురించి తెలుసుకోవడానికి అంతా ఆసక్తి చూపిస్తున్నారు.
అయితే తన భార్య పిల్లల గురించి పరిచయం చేయకపోవటానికి పెద్దగా రీజన్స్ ఏమీ లేవని అన్నారు వేణు. వేణు భార్య పేరు అనుపమ చౌదరి. ఆమె యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ లో ఎంబీఏ పూర్తి చేసిందట. అలాగే ఇంటీరియర్ డిజైనింగ్‌లో ట్రైనింగ్ కూడా తీసుకుందట అనుపమ. వేణు, అనుపమ ఇద్దరి మధ్య బంధుత్వం ఉంది. అందుకే ఇష్టపడి పెళ్లి చేసుకున్నారట. వీరి వివాహం జరిగి 10 ఏళ్ళు పైనే అయ్యింది. వీరికి ఒక పాప, బాబు ఉన్నారు. బిజినెస్ లో బిజీగా ఉండటంతో వేణు సినిమాలకు దూరమయ్యారట. తన భార్య సపోర్ట్ తోనే అటు ఫ్యామిలీని, ఇటు బిజినెస్ ను బ్యాలెన్స్ చేస్తున్నానని చెప్పుకొచ్చారు వేణు.
టెస్లా అధినేత ఎలాన్ మస్క్ గురించి అందరికీ తెలిసిందే. ఈయన ఏది చేసినా సంచలనమే అవుతుంది. అయితే తాజాగా ఈయన…
బ్యాంకు ఉద్యోగాలకు సిద్ధమవుతున్న వారికి కెనరా బ్యాంక్ గుడ్ న్యూస్ చెప్పింది. కెనరా బ్యాంకులో కాంట్రాక్టు బేసిస్ విధానంలో స్పెషలిస్ట్…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను…
న్యూఢిల్లీలో ఉన్న ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ ప్రైవేటు బ్యాంకింగ్ సంస్థల్లో ఒకటైన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి, అర్హత ఉన్న…
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి, అర్హత ఉన్న…
దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పలు పోస్టుల భర్తీకి గాను ఆసక్తి, అర్హత ఉన్న…