Poorna : శ్రీ మహాలక్ష్మీ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయింది పూర్ణ. ఆ తర్వాత అల్లరి నరేష్ హీరోగా నటించిన సీమ టపాకాయ్, రవిబాబు దర్శకత్వంలో అవును చిత్రాలతో సక్సెస్ ను అందుకుని ప్రేక్షకులలో మరింత గుర్తింపును సంపాదించుకుంది. 2004లో మళయాళంలో మంజు పోలోరు పెంకుట్టి చిత్రంతో రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టింది. లడ్డూ బాబు, నువ్విలా నేనిలా వంటి ఎన్నో చిత్రాల్లో నటించి నటన పరంగా మంచి గుర్తింపు సంపాదించుకుంది.
కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ భాషల్లో కూడా పూర్ణ నటించి ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. బుల్లితెరపై ఢీ షో జడ్జ్‌గా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది హీరోయిన్ పూర్ణ. నటనలోనే కాదు డాన్స్ లో కూడా ఆదరగొట్టేస్తోంది. గతేడాది డిసెంబర్ లో వచ్చిన బాలయ్య అఖండ సినిమాలో కీలక పాత్ర పోషించింది. అయితే గత కొంతకాలంగా పూర్ణ పెళ్లి వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పూర్ణ.. ఆసిఫ్ అనే వ్యాపారవేత్త ప్రేమలో ఉన్నట్టు ఇప్పటికే ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చింది. త్వరలోనే ఈ జంట పెళ్లి కూడా చేసుకోబోతోంది అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
పూర్ణ పెళ్లి విషయం బయటకు రావడంతో ఇప్పుడు మరో విషయం వైరల్ గా మారింది. పూర్ణ అప్పట్లో ఓ డైరెక్టర్ తో లవ్ ఎఫైర్ నడిపింది అంటూ ఇండస్ట్రీలో వార్తలు హల్ చల్ చేశాయి. ఆ డైరెక్టర్ మరెవరో కాదు ప్రయోగాత్మక సినిమాలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకునే డైరెక్టర్ రవిబాబు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన అవును చిత్రం మంచి హిట్ అందుకుంది. అవును చిత్రం తరువాత వీరిద్దరి కాంబినేషన్లో అవును 2, లడ్డూ బాబు సినిమాలు వచ్చాయి.
ఇద్దరూ వరుసపెట్టి సినిమాలు చేయడంతో, ఇద్దరి మధ్య ఏదో రిలేషన్ ఉందంటూ ఇండస్ట్రీలో గుసగుసలు పుట్టుకొచ్చాయి. ఇలాంటి బ్యాడ్ రూమర్స్ రావడంతో రవిబాబు ఓ ఇంటర్వ్యూలో స్పందించడం జరిగింది. ఒక చిత్రం కంప్లీట్ అయిన తర్వాత హీరోయిన్లతో నాకు ఎటువంటి కాంటాక్ట్స్ ఉండవు. నేనే అలాంటి బిహేవియర్ కలవాడిని అయితే వేరే హీరోయిన్స్ నా సినిమాలు చేయడానికి ఎందుకు ఒప్పుకుంటారు. ఒకసారి షూటింగ్ పూర్తయిన తర్వాత నేను వాళ్లకు ఫోన్ కూడా చేయను. కేవలం పూర్ణ నటన చూసే చిత్రాల్లో అవకాశం ఇచ్చాను అంటూ తమపై ప్రచారమవుతున్న లవ్ ఎఫైర్ వార్తలకు ఫుల్‌స్టాప్ పెట్టారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…