Vijay Devarakonda : భారత్, పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ వస్తుందటే చాలు.. క్రికెట్ ప్రేమికులకు పండగే అని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ఆదివారం సాయంత్రం ఈ రెండు జట్ల మధ్య టీ20 మ్యాచ్ జరిగింది. ఆసియా కప్ 2022 టోర్నీలో భాగంగా నిర్వహించిన ఈ మ్యాచ్‌లో భారత్.. పాకిస్థాన్‌పై 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. అయితే ఈ మ్యాచ్ ఏమోగానీ అందరూ విజయ్ దేవరకొండను ట్రోల్ చేస్తున్నారు. అసలే లైగర్ మూవీ ఫ్లాప్ అయిన విచారంలో విజయ్ ఉండగా.. ఆయనను నెటిజన్లు ఇంకా ట్రోల్ చేస్తూనే ఉన్నారు. తాజాగా భారత్, పాక్ మ్యాచ్ నేపథ్యంలో విజయ్‌ని మళ్లీ ట్రోల్ చేయడం మొదలు పెట్టారు.
భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌ను చూసేందుకు విజయ్ దుబాయ్ వెళ్లాడు. ఆ మ్యాచ్‌ను చూశాడు. మ్యాచ్‌ను చూస్తుండగా.. విజయ్‌ని కెమెరాల్లో చూపించారు. అంతేకాదు.. మైక్‌లో మాట్లాడాడు కూడా. అయితే విజయ్ మ్యాచ్‌ను వీక్షించడం ఏమోగానీ.. ఆయన వల్లే పాకిస్థాన్ ఓడిందని అంటున్నారు. ఆయనది ఐరన్ లెగ్ అని.. ఆయన లైగర్ మూవీ ఫెయిల్ అయి ఇక్కడకు వచ్చాడని.. దీంతో పాకిస్థాన్‌ను ఫెయిల్ చేశాడని అంటున్నారు. ఈ క్రమంలోనే విజయ్ ఎక్కడికి వెళ్లినా ఆయనకు ప్రస్తుతం ట్రోల్స్ బాధ తప్పడం లేదు.
అయితే విజయ్‌ని ఇలా ట్రోల్ చేయడం వెనుక కూడా బలమైన కారణమే ఉంది. లైగర్ మూవీ రిలీజ్‌కు ముందు విజయ్‌తోపాటు చిత్ర యూనిట్ సభ్యులు తమ సినిమాపై తమకు ఉన్న ఓవర్ కాన్ఫిడెన్స్‌తో అనేక కామెంట్స్ చేశారు. ఓటీటీ వాళ్లు రూ.200 కోట్లు ఇస్తామన్నా వద్దనుకున్నామని.. ఎందుకంటే తమ సినిమా ఇంకా అంతకన్నా ఎక్కువ వసూలు చేస్తుందని అన్నారు. కానీ తీరా చూస్తే సీన్ రివర్స్ అయింది. ఇలా మూవీ రిలీజ్‌కు ముందు అనేక సార్లు ఓవర్ కాన్ఫిడెన్స్‌గా విజయ్, చార్మి, పూరీ చేసిన వ్యాఖ్యలే కొంపముంచాయి. దీంతో ఇప్పుడు వారిని తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. అయితే ఈ ట్రోల్స్ ఎప్పుడు తగ్గుతాయో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…