Kalyan Dhev : క్రమశిక్షణకు, ప్రతిభకు మరో పేరు మెగాస్టార్ చిరంజీవి. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తన సత్తాను చాటుకున్నారు మెగాస్టార్. ఇటు సినీ ఇండస్ట్రీలోనూ అటు రాయకీల్లో కూడా వివాద రహితునిగా వెలుగొందుతున్న చిరంజీవి సాధించిన రికార్డులు, అవార్డులు మరెవ్వరూ టచ్ చెయ్యలేరని చెప్పటంలో అతిశయోక్తి లేదు. సినీ కెరీర్ లో ఆయన నెలకొల్పిన పద్దతి, ఆచరించిన విధానం ఇప్పటి తరం హీరోలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది.
చిరు ఫ్యామిలీకి చెందిన ఎందరో సినీ పరిశ్రమలోకి ప్రవేశించారు అంటే అది కేవలం చిరంజీవి వేసిన బాట అని చెప్పాలి. కేవలం ఇంట్లో వ్యక్తులనే కాదు బయట వ్యక్తులను కూడా ఎంతో ఎంకరేజ్ చేస్తూ ప్రోత్సహించడం ఆయన నైజం అని చెప్పాలి. ఇక ఆయన చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా విజేత మూవీ ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

అల్లునిలో గల టాలెంట్ ని గుర్తించిన చిరంజీవి సినిమాల్లో యాక్ట్ చేయాలని సూచించడం జరిగింది. అలా కళ్యాణ్ దేవ్ విజేత మూవీలో నటించడం జరిగింది. వాస్తవానికి కళ్యాణ్ దేవ్ సినీమా యాక్టర్ కావాలని ఎప్పుడు అనుకోలేదట. శ్రీజను పెళ్లి చేసుకొనే వరకు కూడా అతను ఎవరు అన్నది ఎవరికీ తెలియదు. కానీ మెగాస్టార్ చిన్న కుమార్తె శ్రీజను పెళ్లి చేసుకోవడంతో ఒక్కసారిగా తెరమీదికి వచ్చాడు కళ్యాణ్ దేవ్.
1990 ఫిబ్రవరి 11వ తేదీన కిషన్ దేవ్ కానుగంటి మరియు జ్యోతి దంపతులకు చిత్తూరులో జన్మించాడు కళ్యాణ్ దేవ్. కిషన్ దేవ్ దేశవిదేశాల్లో వ్యాపారాలు సాగిస్తూ, కోట్లాది రూపాయల టర్నోవర్ సాధించాడు. తెలుగు రాష్ట్రాల్లో వారికున్న ఆస్తులు వందల కోట్లలో ఉంటాయని సమాచారం. ఒక్క చిత్తూరు జిల్లాలోనే వారికి చాలా ఫ్యాక్టరీలున్నాయి. కూర్చుని తిన్నా, తరతరాలకు తరగని ఆస్తి ఉన్నాసరే, విదేశాల్లో ఉద్యోగం చేసి, స్వశక్తిని నమ్ముకున్నాడు కళ్యాణ్ దేవ్. టెక్నాలజీ, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లలో మాస్టర్ డిగ్రీ అందుకున్న కళ్యాణ్ కష్టం విలువ ఏమిటో తెలియాలని ఉద్యోగం కూడా చేసాడు.