Brahmanandam : నవ్వుల రారాజు, కామెడీ కింగ్, హాస్య బ్రహ్మ ఇలా ఎన్ని పేర్లు పెట్టి పిలిచినా తక్కవనే చెప్పాలి. ఆయన కనుబొమ్మ ఎగరేస్తే చాలు నవ్వి నవ్వి ప్రేక్షకుల పొట్ట చెక్కలవ్వాల్సిందే. ఆయనే ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం గారు. ఆయన పేరు తలుచుకుంటే చాలు మనం ఏమూడ్‌లో ఉన్నా సరే చిరునవ్వు ఇట్టే పెదవులపైకి వచ్చేస్తుంది. అగ్రహీరోలు సైతం తమ సినిమాల్లో బ్రహ్మానందం ఉండాలనే నిబంధన పెట్టి అతడు లేకపోతే సినిమాలు చేయం అనే సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. దీన్ని బట్టి బ్రహ్మానందం రేంజ్ ఏమిటో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇక చిన్న సినిమాల్లో సైతం బ్రహ్మానందం ఉంటే చాలు మినిమమ్ సక్సెస్ గ్యారంటీ అని నిర్మాతల సైతం నమ్ముతారు.
ఒకప్పుడు ఏ హీరోకి లేని స్థాయిలో క్షణం తీరికలేకుండా బిజీ ఆర్టిస్ట్ గా బ్రహ్మానందం ఒక వెలుగు వెలిగారు. అతి తక్కువ సమయంలోనే 1000 కి పైగా సినిమాలలో నటించి గిన్నిస్ రికార్డును సైతం తన సొంతం చేసుకున్నారు. అయితే ఇప్పటికీ కూడా బ్రహ్మానందం దాదాపుగా కొన్ని సినిమాలు చేస్తూ ఉన్నారు. కానీ ఈ మధ్యకాలంలో ఆరోగ్యం సహకరించకపోవడంతో సినిమాలకు దూరంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అంతేకాకుండా ఆయన సినిమాలలో నటిస్తే చూడాలని ఇప్పటికి ఎంతమంది ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా బ్రహ్మీకి ఇంత డిమాండ్ ఉంది కాబట్టే ఒక రోజు షూటింగ్లో పాల్గొంటే సుమారుగా రూ.4 నుంచి 5 లక్షల వరకు పారితోషకం ఇస్తున్నట్లు సమాచారం వినిపిస్తుంది. ఇక ఒక రోజుకు అంత పారితోషకం తీసుకునే బ్రహ్మానందం తన సినీ కెరిర్లో ఇప్పటివరకు ఎంత డబ్బు సంపాదించారనే విషయం ప్రస్తుతం చర్చనీయాంసంగా మారింది. మరీ బ్రహ్మానందం ఆస్తి విలువ ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.
బ్రహ్మానందం సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత తను సంపాదించిన వాటిలో కొంత పెట్టుబడిని పలు ప్రాంతాలలో భూములుపైన, రియల్ ఎస్టేట్ పైన పెట్టి ఆస్తులు సంపాదించినట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా లేటెస్ట్ గా వచ్చిన ఏ కారు అయినాసరే అతడి ఇంట్లో ఉండాల్సిందే. మేస్టిజ్ బెంజ్, ఆడి అరైట్,ఆడి క్యూ సిక్స్ లాంటి కార్లు ఎన్నో బ్రహ్మానందం ఇంట కనిపిస్తాయి. ప్రస్తుతం బ్రహ్మానందం ఆస్తి విలువ సుమారుగా రూ.650 కోట్ల రూపాయల వరకు ఉన్నట్లుగా ఓ ఆంగ్ల దినపత్రిక ఇచ్చిన సమాచారం వలన బ్రహ్మీ ఆస్తుల విలువ సామాజిక మాధ్యమాలలో చర్చనీయాంశంగా మారింది.