Naga Shourya : టాలీవుడ్ గ్లామర్ హీరో నాగ శౌర్య గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. కెరీర్‌లో విభిన్న కథా చిత్రాలు చేస్తున్నా కూడా మంచి హిట్స్ పడడం లేదు. ఛలో సినిమా నాగ శౌర్య కెరీర్‌లో పెద్ద హిట్‌గా నిలిచింది.చందమామ కథలు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు నాగశౌర్య. అయితే ఈ సినిమాతో ఆయనకు తెలుగులో ఎటువంటి గుర్తింపు రాలేదు. అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ఊహలు గుసగుసలాడే సినిమా ప్రేక్షకులకి దగ్గరయ్యేలా చేసింది. మంచి కథలని ఎంపిక చేసుకుంటూ సినిమాలు చేస్తున్న నాగ శౌర్యకు సరైన విజయం అయితే దక్కడం లేదు.
అయితే నాగశౌర్య.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి బంధువు అని ఎప్పటి నుండో పలు వార్తలు హల్ చల్ చేస్తూనే ఉన్నాయి. గతంలో దీనిపై నాగ శౌర్య సమాధానం ఇచ్చాడు. నాకు, జూనియర్ ఎన్టీఆర్ కి ఎటువంటి రిలేషన్ లేదు. నేను ఎన్టీఆర్ కి అందరిలాగే అభిమానినే, కానీ అతనితో ఎటువంటి సంబంధం లేదు. చిత్ర పరిశ్రమలో నటుడికి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నా అది వారికి అంతగా ఉపయోగపడదు.. అని చెప్పాడు నాగాశౌర్య. అయితే తాజాగా ఇదే విషయంపై శౌర్య తల్లి ఉష స్పందించారు.
ఎన్టీఆర్ తమ బంధువు కాదని ఉష వెల్లడించారు. ఎన్టీఆర్ భార్య.. ప్రణతి కజిన్ శౌర్యకి సన్నిహితురాలు. అలాగే ఆమె తండ్రికి తన కొడుకు గురించి కూడా బాగా తెలుసు . అంతే తప్ప ఎన్టీఆర్‌తో తమకు ఎలాంటి సంబంధం లేదని, కేవలం ఫ్యామిలీ ఫ్రెండ్స్ మాత్రమే అని చెప్పుకొచ్చింది. నాగ శౌర్య తన కెరీర్‌లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు . ఆఫ్ స్క్రీన్‌కి భిన్నమైన వ్యక్తిగా పేరు పొందాడు. అతను షూటింగ్‌కి సెల్‌ఫోన్‌ను కూడా తీసుకెళ్లడు. ఈ విషయం గురించి తల్లే చెప్పింది. చాలా పద్దతిగా ఉంటూ ప్రశంసలు పొందే నాగ శౌర్యకి ఇటీవలి కాలంలో హిట్ అనేది అందని ద్రాక్ష అయింది.
ఇటీవలే లక్ష్య, వరుడు కావలెను వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు శౌర్య. తాజాగా ఈ యంగ్ హీరో మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌పై సంతకం చేశాడు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (SLV సినిమాస్) పతాకంపై ప్రొడక్షన్ నం.6గా సుధాకర్ చెరుకూరి నిర్మించబోయే కొత్త చిత్రాన్ని నూతన దర్శకుడు పవన్ బాసంశెట్టితో చేయనున్నాడు. కమర్షియల్ సబ్జెక్ట్‌తో రూపొందనున్న ఈ చిత్రంలో నావల్‌పాయింట్ నాగ శౌర్యను ఆకట్టుకుంది. తెలుగు నూతన సంవత్సరం – ఉగాది సందర్భంగా శనివారం నాడు ప్రకటించబడిన ఈ చిత్రంలో నాగశౌర్య సరికొత్తగా కనిపించనున్నాడు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…