Anasuya : బుల్లితెర స్టార్ యాంకర్ గా అనసూయ భరద్వాజ్ తన అందం, అభినయంతో విశేష ప్రేక్షకాదరణ దక్కించుకుంది. ఈ క్రమంలోనే ఈమె కేవలం బుల్లితెరపై మాత్రమే కాకుండా వెండితెరపై కూడా ఎన్నో అద్భుతమైన చిత్రాలలో మంచి పాత్రలలో నటిస్తూ బిజీగా ఉంది. ఇలా వ్యక్తిగత జీవితాన్ని, వృత్తిపరమైన జీవితాన్ని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు దూసుకుపోతున్న అనసూయ అసలు పేరు అనసూయ కాదనే విషయం మీకు తెలుసా..?
అవును, అందరికీ ఎంతో సుపరిచితమైన యాంకర్ అనసూయ అసలు పేరు అనసూయ కాదట. ఈమెకు తమ తల్లిదండ్రులు ముందుగా అనసూయ అనే పేరును కాకుండా పవిత్ర అనే పేరు పెట్టాలని భావించారట. అనసూయ తల్లికి తన కూతురికి పవిత్ర అనే పేరు పెట్టడం ఎంతో నచ్చింది. అయితే అనసూయ తండ్రి ముగ్గురు అన్నదమ్ములు కావడంతో వారికి ఆడ పిల్లలు ఎవరూ లేకపోవడం వల్ల ఆమెకు తన పేరు పెట్టాలని అనసూయ తండ్రి భావించారు.
ఈ క్రమంలోనే ఈమెకు పవిత్ర అనే పేరు కాకుండా తన నానమ్మ పేరు అనసూయ అని పెట్టారు. అలా పవిత్రగా మన ముందుకు రావాల్సిన ఈమె అనసూయగా ఎంతో మంచి పేరు సంపాదించుకుని ఇండస్ట్రీలో దూసుకుపోతోంది. ప్రస్తుతం ఈమె సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప చిత్రంలో నటిస్తోంది.