శుక్రవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా వైఎస్ఆర్ సీపీ నాయకులు చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి పై అసభ్యకర పదజాలంతో అవమానించి మాట్లాడారంటూ చంద్రబాబు మీడియా ముందు కన్నీటిపర్యంతమయ్యారు. ఈ క్రమంలోనే పలువురు సినీ సెలబ్రిటీలు ఈ విషయంపై స్పందిస్తూ ఘాటు విమర్శలు చేశారు.
ఇక ఈ ఘటనపై సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ స్పందిస్తూ.. వైసీపీ నాయకులకు హెచ్చరికలు జారీ చేశారు. తాజాగా ఈ ఘటనపై స్పందించిన ప్రకాశం జిల్లా కానిస్టేబుల్ తన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు ఒక వీడియోను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
చంద్రబాబు గారి పై వైసీపీ ఎమ్మెల్యేలు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఒక కానిస్టేబుల్ ఖండించారు. చంద్రబాబుగారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తనకు ఉద్యోగం వచ్చిందని.. ఈరోజు వరకు విలువలతో చేయి చాచకుండా నిజాయతీగా బ్రతికానని…వైసీపీ చేసే దిగజారుడు రాజకీయాలు మంచివి కావని అంటూ కన్నీటిపర్యంతమయ్యారు pic.twitter.com/avzAJHnin3
— Telugu Desam Party (@JaiTDP) November 20, 2021
ఈ వీడియోలో భాగంగా తను పేరు విజయ్ కృష్ణ అని, 1998 బ్యాచ్ సివిల్ కానిస్టేబుల్ రిటర్న్ టెస్ట్ టాపర్ అని, చంద్రబాబు నాయుడు హయాంలో తనకు ఉద్యోగం వచ్చిందని, ఇప్పటివరకు విలువలతో కూడిన ఉద్యోగం చేస్తూ ఎవరి దగ్గరా చేయిచాచకుండా బతికానని తెలిపారు.
తన జీవితంలో అవినీతికి తావు లేకుండా ఉద్యోగం చేశానని మొదటిసారిగా పోలీస్ వ్యవస్థలో మోకరిల్లి, పోస్టింగుల కోసం నీచమైన అవమానాలతో ఎంతో దిగజారి పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఇలాంటి ఉద్యోగం తనకు వద్దంటూ తన ఉద్యోగానికి రాజీనామా చేసి హోటల్, టీ కొట్టు పెట్టుకొని బ్రతుకుతానని ఈయన పోస్ట్ చేసిన వీడియో వైరల్ గా మారింది.