Thammudu Collections : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయనను అభిమానులు దేవుడిగా భావిస్తారు. పవన్ కెరీర్ ఆరంభంలోనే ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ పడ్డాయి. దీంతో చిరంజీవి సోదరుడు అయినప్పటికీ సొంత టాలెంట్‌తో ఈయన పైకి వచ్చారు. ఇక అప్పట్లో ఈయన నటించిన తమ్ముడు మూవీ సంచలనం సృష్టించింది. టాలీవుడ్‌లో ట్రెండ్ సెట్ చేసిన మూవీ ఇది. ఇది పవన్‌కు ఎంతో లైఫ్‌ను ఇచ్చింది. దీన్ని అరుణ్ ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కించారు.
తమ్ముడు మూవీ పవన్ కెరీర్‌లోనే ఒక మైలురాయిలా నిలిచిపోతుందని చెప్పవచ్చు. అప్పట్లో ఈ మూవీ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఇక పవన్ ఈ మూవీ అనంతరం వెనక్కి తిరిగి చూసుకోలేదు. హిట్స్ మీద హిట్స్ పడ్డాయి. కిక్ బాక్సింగ్ నేపథ్యంలో వచ్చిన తొలి ఇండియన్ మూవీ ఇదే కాగా.. ఇందులో పవన్ నటన, డ్యాన్స్, ఫైట్స్ ఆకర్షించాయి. దీంతో సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అయితే అరుణ్ ప్రసాద్ డైరెక్టర్ అయినప్పటికీ ఈ మూవీకి కొన్ని సీన్లలో పవనే స్వయంగా డైరెక్షన్ బాధ్యతలను నిర్వర్తించారట.

ఇక ఈ మూవీలోని లుక్ ఎట్ మై ఫేస్ ఇన్ ది మిర్రర్, మేడ్ ఇన్ ఆంధ్ర స్టూడెంట్ పాటలు.. అప్పట్లో యువతను ఒక ఊపు ఊపాయని చెప్పవచ్చు. ఏ గల్లీలో విన్నా ఇవే పాటలు వినిపించేవి. ఈ క్రమంలోనే ఈ మూవీకి అప్పట్లోనే రూ.11 కోట్ల షేర్ వచ్చింది. నిర్మాతలకు, బయ్యర్లకు ఈ మూవీ మంచి లాభాలను తెచ్చి పెట్టింది. ఇక ఈ మూవీ 60 కేంద్రాల్లో 50 రోజులు ఆడగా.. 2 కేంద్రాల్లో 175 రోజులకు పైగా ఆడింది. అలా పవన్ కెరీర్‌లోనే తమ్ముడు మూవీ ఒక మైలు రాయిలా నిలిచిందని చెప్పవచ్చు.