Prabhas : సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో సెలబ్రిటీలకు చెందిన ప్రేమలు, పెళ్లిళ్ల వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. అప్పట్లో సమంత, నాగచైతన్య విడిపోతారని కథకథలుగా వార్తలు వచ్చాయి. అయితే వాటిని వారు ఖండించారు. కానీ చివరకు విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి అందరికీ షాకిచ్చారు. తరువాత చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ, కల్యాణ్ దేవ్‌లతోపాటు మెగా డాటర్ నిహారిక, చైతన్య దంపతులు కూడా విడాకులు తీసుకోబోతున్నారంటూ వార్తలు హల్ చల్ చేశాయి. కానీ వీటిపై మాత్రం క్లారిటీ రాలేదు. ఇక ఈ మధ్య కాలంలో నరేష్, పవిత్ర లోకేష్‌లపై కూడా వార్తలు వచ్చాయి. అయితే ఇవి కూడా ఆశ్చర్యకరంగా నిజమే అయ్యాయి. నరేష్ తో తనకు సంబంధం ఉందని పవిత్ర లోకేష్ తేల్చి చెప్పేసింది. తనకు ఈ విషయంలో సపోర్ట్ కావాలని కూడా కోరింది.
అయితే తాజాగా మరో వార్త వైరల్ అవుతోంది. అదేమిటంటే.. ప్రభాస్, రానా ఎంత మంచి మిత్రులో అందరికీ తెలిసిందే. వీరిద్దరూ బాహుబలి సినిమాలో కలసి నటించారు. ప్రభాస్ హీరో పాత్ర వేయగా.. రానా విలన్ రోల్‌లో నటించారు. ఈ ఇద్దరి నటనకు మంచి మార్కులే పడ్డాయి. దీంతో వీరు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందారు. అయితే వీరిద్దరూ గతంలో ఒక హీరోయిన్‌ను ప్రేమించారని తాజాగా వార్తలు వైరల్ అవుతున్నాయి. గతంలో రానాకు, త్రిషకు మధ్య లవ్ ట్రాక్ నడించిందని వార్తలు వచ్చాయి. వీరు పెళ్లి కూడా చేసుకుంటారని అన్నారు. కానీ అది జరగలేదు. ఇక వర్షం సినిమా నుంచే త్రిష, ప్రభాస్‌లకు మధ్య ప్రేమాయణం నడించిదని టాక్ వచ్చింది.
ఆ తరువాత బుజ్జిగాడు, పౌర్ణమి చిత్రాలతో త్రిష, ప్రభాస్‌ల మధ్య బంధం మరింత బలపడిందని సమాచారం. కానీ ఏం జరిగిందో తెలియదు.. తరువాత వీరిద్దరూ విడిపోయారట. అలా రానా, ప్రభాస్‌లు ఇద్దరూ త్రిషను అప్పట్లో ప్రేమించారని ప్రస్తుతం వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఇది నిజమే అయి ఉంటుందని కూడా అంటున్నారు. ఎందుకంటే రానా, త్రిష లవ్ ట్రాక్‌ను పక్కన పెడితే ప్రభాస్, త్రిష లవ్ ట్రాక్ నిజమే అయి ఉంటుందని అంటున్నారు. గతంలో ప్రభాస్ తన పెళ్లిపై కీలకవ్యాఖ్యలు చేశారు. ప్రేమ, పెళ్లిలను అంచనా వేయడంలో తాను ఫెయిల్ అయ్యానని అన్నారు. అంటే ఈయన లవ్‌లో ఫెయిల్యూర్ అన్న సంగతి స్పష్టమవుతోంది.
గతంలో ప్రభాస్, అనుష్కల మధ్య లవ్ ట్రాక్ ఉందని.. దాన్ని ప్రభాస్ ఇన్‌డైరెక్ట్‌గా చెబుతూనే అలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటాడని అనుకున్నారు. కానీ ఇప్పుడు త్రిష మ్యాటర్ తెరపైకి వచ్చింది. దీంతో త్రిషతోనూ ప్రభాస్ లవ్ ఫెయిల్ అయి ఉంటుందని.. కనుకనే ఆయన గతంలో అలా వ్యాఖ్యలు చేసి ఉంటారని అంటున్నారు. ఏది ఏమైనా ఇప్పుడీ మ్యాటర్ మాత్రం హాట్ టాపిక్ అవుతోంది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…