Pavitra Lokesh : గత కొద్ది రోజులుగా సీనియర్ నటుడు నరేష్, నటి పవిత్ర లోకేష్‌ల గురించి వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వ్యవహారంలోకి అనూహ్యంగా నరేష్ భార్య రమ్య రఘుపతి, పవిత్ర లోకేష్ భర్త సుచేంద్ర ప్రసాద్ వచ్చారు. వారు కర్ణాటకలో మీడియా ఎదుట నానా హంగామా చేశారు. దీంతో వీరి వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే తాజాగా ఓ తెలుగు న్యూస్ చానల్ నిర్వహించిన చర్చ సందర్భంగా పవిత్ర లోకేష్, రమ్య రఘుపతి, నరేష్‌లు ఆ చానల్‌తో మాట్లాడారు. అసలు తమ మధ్య ఏం జరిగింది.. అన్న వివరాలను తమ సొంత వెర్షన్‌లలో చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే పవిత్రా లోకేష్ కూడా అనేక విషయాలను తెలియజేసింది.
పవిత్ర లోకేష్ మీడియాతో మాట్లాడుతూ.. రమ్య రఘుపతి తన భర్త నరేష్‌తో విడాకులు తీసుకోలేదని చెబుతోంది. తాను ఇంకా తమ బంధాన్ని సెట్ చేసుకోవాలనే చూస్తున్నానని చెప్పింది. అయితే నరేష్ ఉంటున్నది తెలుగు రాష్ట్రంలో. మరలాంటప్పుడు రమ్య రఘుపతి కర్ణాటక మీడియాలో రచ్చ చేయడం ఎందుకు. ఆమెకు కావాలంటే ఇక్కడే సెటిల్ చేసుకోవాలి కదా. అనసవరంగా నరేష్‌ను ఇందులో ఇరికించడం ఎందుకు.. అని పవిత్రా లోకేష్ అన్నారు.
ఇక తనకు, నరేష్‌కు మధ్య ఉన్న సంబంధం నిజమేనని.. అయితే ఇందుకు సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం కూడా అడ్డు చెప్పలేదని.. తమ రిలేషన్‌పై ఎవరికీ ఎలాంటి అభ్యంతరాలు లేవని.. అలాంటప్పుడు రమ్యకు వచ్చిన నష్టమేమిటని ప్రశ్నించారు. ఆమె కావాలనుకుంటే భర్తతో ఉండవచ్చని.. కానీ కర్ణాటకలో రాద్ధాంతం చేస్తే ఎలా.. తెలుగు రాష్ట్రాల్లో ఫ్యామిలీ కోర్టులు ఉన్నాయి. ఏ విషయమైన అక్కడ తేల్చుకోవాలి.. అని పవిత్ర అన్నారు.
అయితే నరేష్ విషయంలో రమ్య రఘుపతి చేసింది కరెక్ట్ కాదని.. ఆమె ఏదైనా సెటిల్ చేసుకోవాలనిపిస్తే హైదరాబాద్‌కు రావాలని అన్నారు. బెంగళూరులో ఆమె చేసిన రచ్చకు నరేష్ అక్కడికి వెళ్లి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చిందని.. ఈ విషయంలో అందరూ నరేష్‌కు సపోర్ట్ ఇవ్వాలని ఆమె కోరారు. అలాగే తమ బంధం గురించి అందరికీ తెలుసని.. తమకు సపోర్ట్ చేయాలని ఆమె ప్రేక్షకులను కోరారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…