Nidhhi Agerwal : బాలకృష్ణ సినిమా వస్తుందంటే చాలు.. అభిమానులకు పండగే అని చెప్పవచ్చు. ఆయన సినిమాలకు థియేటర్లలో బాక్సులు దద్దరిల్లిపోతాయి. అంతలా ఆయన సినిమాల ప్రభావం ఉంటుంది. ఇక ఈయన ఈమధ్యే అఖండ సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. చాలా రోజుల తరువాత బాలయ్య మళ్లీ ఈ చిత్రం ద్వారా హిట్ కొట్టి జోరు మీదున్నారు. కరోనా ప్రభావం ఉన్నప్పటికీ అఖండ వసూళ్లలో సునామీని సృష్టించింది. ఈ క్రమంలోనే అఖండ జోష్‌తో బాలయ్య వరుస సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో శృతి హాసన్‌తో కలిసి సినిమా చేస్తున్నారు. అయితే ఈ మూవీ అనంతరం ఆయన అనిల్ రావిపూడితో మూవీ చేయనున్నారు.
ఇక అనిల్ రావిపూడి సినిమాలో బాలయ్య కుమార్తెగా శ్రీలీల నటించనుంది. అయితే బాలయ్యకు ఇందులో హీరోయిన్‌గా ముందుగా పలువురి పేర్లు వినిపించాయి. వారిలో ప్రియమణి పేరు ఒకటి. కానీ ఆమెకు కాల్ షీట్స్ అడ్జస్ట్ కావడం లేదని సమాచారం. దీంతో ఆమెకు బదులుగా ఈ మూవీలో నిధి అగర్వాల్‌ను తీసుకుంటారని తెలుస్తోంది. అదే జరిగితే నిధి అగర్వాల్ నక్క తోక తొక్కిందనే చెప్పవచ్చు. ఎందుకంటే ఆమె ఇప్పటి వరకు చేసింది చిన్న హీరోలతోనే. అగ్ర హీరోలతో నటించలేదు. పవన్ కల్యాణ్‌తో కలిసి హరిహర వీరమల్లు చిత్రంలో నటిస్తోంది. కానీ ఈ మూవీ షూటింగ్ అర్థాంతరంగా ఆగిపోయింది. ఇక ఈ సినిమా మళ్లీ ఎప్పుడు మొదలవుతుందో.. ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు. మరోవైపు వేరే సినిమాలకు కూడా ఈమె ఓకే చెప్పలేదు. కనుక బాలయ్య లాంటి అగ్రహీరో సినిమాలో హీరోయిన్‌గా ఆఫర్ వస్తే కాదనలేదు కదా. కాబట్టి ఈమె ఈ మూవీకి ఓకే చెప్పిందనే తెలుస్తోంది. కానీ దీనిపై అధికారికంగా ఎలాంటి వివరాలను వెల్లడించలేదు. త్వరలో వెల్లడించే అవకాశం ఉంది.
ఇక నిధి అగర్వాల్ చివరిసారిగా అశోక్ గల్లాతో కలిసి హీరో అనే మూవీలో నటించింది. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పాలైంది. ఆ తరువాత ఈమె మూవీలు ఏమీ రిలీజ్ కాలేదు. అయితే బాలయ్యతో సినిమా చేస్తే అది ఈమెకు కాస్త బూస్టింగ్ ఇస్తుందని చెప్పవచ్చు. దీంతో ఈమెకు మళ్లీ ఆఫర్లు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఇక బాలయ్య సినిమాలో ఈమె నటించే విషయమై అధికారికంగా వివరాలను వెల్లడించాల్సి ఉంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…