Deepthi Sunaina : బిగ్ బాస్ పేరు చెప్పగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చే జంట.. దీప్తి సునైన, షణ్ముఖ్. కానీ వీరు విడిపోయారు. వీరిద్దరూ కలసి ఉంటే తాజాగా జరిగిన వాలెంటైన్స్ డే వీరికి ఎంతో ప్రత్యేకం అయి ఉండేది. కానీ బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 అనంతరం కొద్ది రోజులకు వీరు బ్రేకప్ చెప్పుకున్నారు. వీరి బ్రేకప్‌కు కారణం ఏమిటనేది అందరికీ తెలుసు. మరోవైపు బిగ్ బాస్ ఇంట్లో ఉన్నన్ని రోజులు షణ్ముఖ్‌తో హగ్గులు, కిస్సులతో రెచ్చిపోయిన సిరి మాత్రం తన ప్రియుడు శ్రీహాన్‌తో చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతోంది. తనకు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది. దీంతో షణ్ముఖ్ అభిమానులు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్యాయంగా షణ్ముఖ్ జీవితాన్ని నాశనం చేసిందని కామెంట్లు చేస్తున్నారు. అయితే అది గతం. ఇకపై చేయాల్సింది ఏమిటన్నది షణ్ముఖ్, దీప్తిల ముందు ఉన్న తక్షణ కర్తవ్యం.

వీరు విడిపోయిన తరువాత సోషల్ మీడియాలో ఇద్దరి మధ్యా కోల్డ్ వార్ నడిచింది. ఒకరిపై ఒకరు పరోక్షంగా పోస్టులు పెట్టుకున్నారు. అయితే వాలెంటైన్స్ డే సందర్భంగా వీరు కలవబోతున్నారని.. బిగ్ బాస్ ఓటీటీ ప్రారంభం అవుతుందని.. అదే వేదికపై వీళ్లను కలుపుతారని.. వార్తలు వచ్చాయి. కానీ అవేమీ నిజం కాలేదు. అయితే ప్రేమికుల దినోత్సవం సందర్భంగా దీప్తి సునైన పెట్టిన పోస్టు వైరల్‌గా మారింది.
తన శరీరంపై ఉన్న టాటూలు కనిపించేలా విచారమైన ముఖంతో కూడిన ఫొటోను ఆమె పోస్ట్ చేసింది. అలాగే.. ఆనందం అనేది మనకు మనం సమకూర్చుకోవాల్సిన బాధ్యత, వేరొక మనిషి నీకు అది తీసుకురారు.. అంటూ కామెంట్ చేసింది. దీన్నిబట్టి చూస్తే ఆమె తీవ్రమైన డిప్రెషన్‌లో ఉన్నట్లు స్పష్టమవుతోంది. అయితే రానున్న రోజుల్లో అయినా వీరు కలుస్తారా, లేక భగ్న ప్రేమికుల్లా ఉండిపోతారా.. అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.