Viral Video : ప్రమాదాలు అనేవి చెప్పి జరగవు. అనుకోకుండానే జరుగుతాయి. అయితే మనం చేజేతులా కొన్నిసార్లు చేసే పొరపాట్లే మనకు ప్రమాదాలను తెచ్చి పెడుతుంటాయి. ప్రమాదం జరుగుతుందని తెలిసి కూడా కొందరు వద్దన్న పనినే చేస్తుంటారు. అయితే అలాంటి ప్రమాదాల్లో కొందరు అదృష్టవశాత్తూ బయట పడుతుంటారు. అవును.. అక్కడ కూడా సరిగ్గా ఇలాగే జరిగింది. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే..

ఓ వ్యక్తి రైలు పట్టాలను దాటబోయాడు. గేట్ వేసి ఉంది. ఆగుదామని అనుకోలేదు. బైక్‌ను గేట్ కింద నుంచి పట్టాల మీదకు తెచ్చాడు. అయితే అనుకోకుండా అతని బైక్ అదుపు తప్పి కింద పడింది. అయితే ఆ సమయంలో బైక్ పట్టాల మీద ఉంది. కానీ అతను పక్కన ఉన్నాడు. దీంతో అటుగా వచ్చిన రాజధాని ఎక్స్‌ప్రెస్ పట్టాల మీద ఉన్న బైక్‌ను ఢీకొడుతూ వెళ్లింది. కొద్దిలో అయితే అతను పట్టాల మీదకు వెళ్లి ఉంటే అతను ట్రెయిన్ కింద పడి ఉండేవాడు. ప్రాణాలు పోయేవి. కానీ బైక్ మాత్రమే పట్టాల మీద ఉండడంతో అతను తృటిలో.. వెంట్రుకవాసిలో ప్రమాదాన్ని తప్పించుకున్నాడు.
Smithereens 2022… bike and train🙂🙂🙂 https://t.co/alAgCtMBz5 pic.twitter.com/jBwFDeGGYA
— Rajendra B. Aklekar (@rajtoday) February 14, 2022
ఇక ఆ సమయంలో అక్కడే ఉన్న సీసీకెమెరాల్లో ఆ దృశ్యాలు రికార్డయ్యాయి. ఈ క్రమంలోనే ఆ వ్యక్తి రైలు ప్రమాదం నుంచి తప్పించుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందరూ అతన్ని విమర్శిస్తున్నారు. కాసేపు ఆగి ఉంటే కొంపలు మునిగిపోతాయా.. అంటూ నెటిజన్లు విమర్శిస్తున్నారు.