Currency Notes : ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తికి చెందిన పరిశ్రమలో ఐటీ, జీఎస్‌టీ అధికారులు సోదాలు నిర్వహించగా.. అందులో భారీ ఎత్తున డబ్బు బయట పడుతోంది. కోట్ల కొద్దీ రూపాయలను అధికారులు ఇప్పటి వరకు బయటకు తీశారు. ఇంకా తీస్తూనే ఉన్నారు. ప్రస్తుతానికి లభించిన డబ్బు రూ.150 కోట్లకు పైగానే ఉంటుందని భావిస్తున్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో పీయూష్ జైన్ అనే ఓ వ్యక్తి గత నెలలో సమాజ్‌వాదీ అత్తర్ (పెర్‌ఫ్యూమ్)ను లాంచ్ చేశాడు. ఈయనకు అక్కడి సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌తో సత్సంబంధాలు ఉన్నాయి. అయితే జీఎస్‌టీ, పన్ను ఎగవేసిన కేసులో గత వారం రోజుల నుంచి ఆయా శాఖలకు చెందిన అధికారులు పీయూష్ జైన్ పరిశ్రమలో సోదాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే గురువారం వరకు ఆ పరిశ్రమలో రూ.150 కోట్ల మేర డబ్బును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఇక ఇప్పటికీ అక్కడ సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ సోదాల్లో పెద్ద ఎత్తున డబ్బు బయట పడుతుండడం విశేషం.
ఆ పరిశ్రమలో నిర్వహించిన సోదాల్లో నోట్ల కట్టలు బయట పడుతుండగా.. వాటిని అధికారులు అక్కడికక్కడే మూడు కౌంటింగ్ మెషిన్‌లు పెట్టి లెక్కిస్తున్నారు. దీంతో నోట్ల కట్టలు గుట్టలుగా పేరుకుపోతున్నాయి. ఆ డబ్బును చూసి అధికారులు షాకవుతున్నారు. అయితే పీయూష్ జైన్‌కు సంబంధించి పలు కీలకపత్రాలను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఇక అతని సోదరుడు పమ్మి జైన్ సమాజ్‌వాదీ పార్టీలో నేతగా ఉన్నారు. ఈ క్రమంలోనే కాన్‌పూర్‌లో ఉన్న కేకు అగర్వాల్ అనే మరో వ్యాపారి పరిశ్రమలోనూ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. సదరు డబ్బంతా లెక్కలోకి రానిదని, పన్ను ఎగ్గొట్టి పోగు చేసినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…