Aamir Khan : బాలీవుడ్ నటుడు అమీర్‌ఖాన్ తన రెండో భార్య కిరణ్ రావుకు విడాకులు ఇచ్చిన విషయం విదితమే. తమ 15 ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి పలుకుతూ ఈ జంట గత జూలైలో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అయితే దంగల్ సినిమా నటి ఫాతిమా సనా షేక్‌తో అమీర్‌ఖాన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నాడని.. అందుకనే కిరణ్ రావుకు విడాకులు ఇచ్చాడని.. అప్పట్లో వార్తలు షికార్లు చేశాయి.
అయితే కిరణ్ రావుకు విడాకులు ఇచ్చాకనైనా అమీర్‌ఖాన్.. ఫాతిమాను పెళ్లి చేసుకుంటాడని అనుకున్నారు. కానీ అలా జరగలేదు. చూస్తుంటే వారు ఇంకా రిలేషన్‌షిప్ లోనే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అమీర్‌ఖాన్ తాజాగా ఫాతిమా సనా షేక్‌ను సీక్రెట్ గా వివాహం చేసుకున్నాడని చెబుతూ.. ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అమీర్‌ఖాన్‌కు, దంగల్ నటి ఫాతిమా సనా షేక్‌కు ఇటీవలే సీక్రెట్‌గా వివాహం జరిగిందని.. ఓ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అయితే పరీక్షించి చూడగా.. సదరు ఫొటో ఫేక్ అని తేలింది. వాస్తవానికి ఆ ఫొటోలో ఫాతిమా స్థానంలో ఉన్నది కిరణ్ రావు.
ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేష్ అంబానీ కుమారుడు ఆకాష్ అంబానీకి, పిరామల్ హెల్త్ కేర్ అధినేత కుమార్తె శ్లోకా మెహతాకు జరిగిన వివాహ వేడుకలో అమీర్‌ఖాన్ తన భార్య కిరణ్ రావుతో పాల్గొన్నాడు. అయితే ఆ ఫొటోలో కిరణ్ రావు ముఖానికి బదులుగా ఫాతిమా ముఖాన్ని మార్ఫింగ్ చేశారు. అనంతరం దాన్ని వైరల్‌గా మార్చారు. దీంతో నిజంగానే అమీర్‌ఖాన్ మూడో పెళ్లి సీక్రెట్ గా చేసుకున్నాడా..? అని అందరూ ఆశ్చర్యపోయారు. అయితే ఇది ఫేక్ ఫొటో అని, ఈ వార్త ఫేక్ అని స్పష్టమైంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…