Balakrishna : నందమూరి బాలకృష్ణ ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు అన్‌స్టాపబుల్ అనే టాక్ షోలో అదరగొడతున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు సెలబ్స్ హాజరు కాగా, వారితో బాలయ్య చేసే ఫన్ ఓ రేంజ్‌లో ఉంది. ఇప్పుడు అల్లు అర్జున్ టైం వచ్చింది. బాలయ్యతో బన్నీ చేసే సందడి పీక్స్‌లో ఉంటుందని అంటున్నారు. ‘ఆహా’ ఓటీటీలో బాలయ్య హోస్ట్ చేస్తున్న ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే’ షోకు అల్లు అర్జున్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు.
‘పుష్ప’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అల్లు అర్జున్, హీరోయిన్ రష్మిక, డైరెక్టర్ సుకుమార్ కలిసి ఈ షో లో సందడి చేశారు. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని విశేషాలతోపాటు అతిథులుగా విచ్చేసిన వారిపై ఉన్న రూమర్ల గురించి స్పష్టత ఇచ్చారు. ‘పుష్ప’ సినిమా దర్శకుడు సుకుమార్, హీరోయిన్ రష్మిక కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రోమో చివర్లో అల్లు అర్జున్ స్టైల్ లో బాలయ్య నడుస్తూ వచ్చి.. “పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా… ఫైర్.. తగ్గేదేలే” అనే డైలాగ్ ను చెప్పడంతో అందరూ ఫుల్‌గా ఎంజాయ్ చేశారు.
క్రిస్మస్ కానుకగా నేడు ఈ షో ప్రీమియర్ కానున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ‘అఖండ’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే కదా. ఈ ఈవెంట్‌లో అల్లు అర్జున్ మాట్లాడుతూ.. మూడు పేజీల డైలాగులైనా బాలయ్యలా చెప్పడం అందరికీ సాధ్యం కాదని చెప్పి బాలయ్య అభిమానుల మెప్పు పొందారు బన్నీ.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…