Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు తొలిసారిగా పూర్తి స్థాయి నిడివి ఉన్న పాత్రల్లో ఆచార్య సినిమా ద్వారా కనిపించారు. ఈ మూవీ ఏప్రిల్ 29వ తేదీన రిలీజ్ అయింది. అయితే భారీ నష్టాలను చవిచూసింది. చిరంజీవి కెరీర్‌లో అత్యంత దారుణమైన ఫ్లాప్‌ను మూటగట్టుకున్న సినిమాల్లో ఇదొకటిగా మారింది. ఈ క్రమంలోనే సినిమాకు దాదాపుగా రూ.84 కోట్ల మేర నష్టం వచ్చిందని అంటున్నారు. నష్టాలను చరణ్ భరిస్తానని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఆచార్య ఫెయిల్ అవ్వడం వెనుక ఎన్ని కారణాలు ఉన్నప్పటికీ.. ప్రధానంగా చిరంజీవి ఈ సినిమా కథ విషయంలో కలగజేసుకున్నారని.. కనుకనే ఫెయిల్ అయిందని అంటున్నారు. దర్శకుడికి పూర్తి స్థాయిలో స్వేచ్ఛ ఇవ్వలేదని.. చిరంజీవి కథలో మార్పులు చేయించారని.. కనుకనే సినిమా ఫ్లాప్ అయిందని అంటున్నారు.
చిరంజీవి పాత తరానికి చెందిన ఐడియాలను ఈ సినిమా కథలో జొప్పించారని.. ఆయన కథకు మార్పులు చేశారని సమాచారం. కనుకనే దర్శకుడు కొరటాల శివ కూడా ఈ విషయంలో అసంతృప్తిగా ఉన్నట్లు తెలిసింది. అయితే చిరంజీవి ఐడియాలు మంచివే. కానీ ఇప్పటి తరానికి అనుగుణంగా అవి ఉండవు. ఇప్పుడు కొత్త కొత్త దర్శకులు కొత్త ఐడియాలతో ఇప్పటి తరాన్ని ఆకట్టుకునే విధంగా కథలను రూపొందిస్తున్నారు. కనుక ఆ స్వేచ్ఛను దర్శకుడికే ఇచ్చి ఉంటే బాగుండేదని.. అప్పుడు ఆచార్య కథ మోడ్రన్‌గా ఉండేదని.. అది ఇప్పటి తరానికి కనెక్ట్ అయి ఉండేదని.. దీంతో సినిమా అంతగా ఫ్లాప్ కాకుండా.. కనీసం యావరేజ్ టాక్‌ను అయినా సొంతం చేసుకుని ఉండేదని.. అంటున్నారు.
అయితే సినిమా కథలో వేలు పెట్టడం వల్లే ఇలా జరిగి ఉంటుందని కూడా భావిస్తున్నారు. ఈ క్రమంలోనే చిరంజీవి ఇకపై సినిమాల కథల విషయంలో దర్శకులు, రచయితలకు స్వేచ్ఛను ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అయితే ఇదే విషయానికి చిరంజీవి ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. ఆయన ఇకపై కథల విషయంలో జోక్యం చేసుకోకూడదని నిర్ణయించుకున్నట్లు సమాచారం. కథ, డైలాగ్స్, దర్శకత్వం వంటి అంశాల్లో ఇకపై కలగజేసుకోకూడదని చిరు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అందుకనే ఆయన ప్రస్తుతం నటిస్తున్న భోళా శంకర్, గాడ్ ఫాదర్‌లతోపాటు త్వరలో తెరకెక్కనున్న వాల్తేరు వీరయ్య సినిమా విషయంలోనూ ఇకపై జోక్యం చేసుకోబోనని అంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఆగస్టులో చిరంజీవి గాడ్ ఫాదర్‌తో రానున్నారు. మరి ఆ మూవీ ఎలా ఉంటుందో చూడాలి.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…