Jeevitha Rajasekhar : నటి జీవితా రాజశేఖర్ ఈమధ్య తెగ వార్తల్లో నిలిచారు. తనకు డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టిందని.. అడిగితే బెదిరిస్తుందని.. ఆరోపిస్తూ ఓ నిర్మాత ఆమెకు నోటీసులు పంపించారు. అయితే ఇదంతా కుట్ర అని.. తమ కుటుంబాన్ని ఇరుకున పెట్టేందుకు ఎవరో కావాలనే ఇలా చేస్తున్నారని జీవిత ఆరోపణలు చేశారు. ఇక తమ కుమార్తెల గురించి యూట్యూబ్ చానళ్లలో తప్పుడు వార్తలు రాస్తూ.. థంబ్ నెయిల్స్ పెడుతున్నారని.. అలా చేయవద్దని.. ఆమె కన్నీటి పర్యంతం అయ్యారు. దీంతో ఆమె వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ఇక రాజశేఖర్ ప్రధాన పాత్రలో వస్తున్న శేఖర్ చిత్రానికి గాను జీవిత దర్శకత్వం వహించారు. ఈ క్రమంలోనే సినిమా విడుదల సందర్భంగా ఆమె మీడియాతో ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో ఆమె పలు కీలక విషయాలను వెల్లడించారు.
తాను లేదా తన భర్త రాజశేఖర్ ఏ రాజకీయ పార్టీలో చేరలేదని.. అయితే తాను బీజేపీలో అప్పట్లో చేరినా.. తనకు సినిమా ఇండస్ట్రీలో ఉన్న పనుల కారణంగా.. తాను బిజీగా ఉండడం చేత.. పార్టీకి సరిగ్గా పనిచేయలేదని.. ఆ తరువాత రాజకీయాలకు దూరంగా ఉన్నానని తెలిపారు. ఇక వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కాంగ్రెస్‌లో చేరామని.. కానీ ఆ పార్టీలో చిరంజీవి తన ప్రజా రాజ్యం పార్టీని విలీనం చేశాక.. ఆయనతో అప్పట్లో ఉన్న గొడవల కారణంగా కాంగ్రెస్ లో కూడా కొనసాగలేక బయటకు వచ్చేశామని వివరించారు. అయితే జగన్ సీఎం అయ్యాక ఆయనను పర్సనల్‌గా కలుద్దామని చాలా సార్లు అనుకున్నామని.. కానీ తనకు, తన భర్తకు వీలు కాలేదని అన్నారు.
ఇక తన కుటుంబంపై తన డామినేషన్ ఎక్కువగా ఉంటుందని అడగ్గా.. అందుకు ఆమె బదులిస్తూ.. తన భర్తకు తెలుగు అంతగా రాదని.. సరిగ్గా మాట్లాడలేరని.. కనుక ఆయనకు బదులుగా తానే మాట్లాడతానని.. అయితే దీని వల్ల తప్పుడు సంకేతం వెళ్లిందని.. తాను భర్తను డామినేట్ చేస్తానని అనుకుంటున్నారని.. జీవిత తెలియజేశారు. కాగా తనకు చిరంజీవి లేదా మోహన్‌బాబుతో ఎలాంటి విభేదాలు లేవని ఆమె స్పష్టం చేశారు.
మా ఎన్నికల్లో తనకు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలనే ఆలోచన లేదని.. అయితే ప్రకాష్ రాజ్ ఇండస్ట్రీకి ఏదో చేస్తారన్న ఉద్దేశంతో ఆయన ప్యానెల్ తరఫున పోటీ చేశానని తెలిపారు. ఆయన మళ్లీ మా ఎన్నికల్లో పోటీ చేస్తారని చెప్పారు. ఇక నరేష్ చేస్తున్న పనులు నచ్చకే తాను మళ్లీ పోటీ చేయాలని భావించానని అన్నారు. అలాగే అనేక సార్లు తాను ప్రకాష్ రాజ్‌తో మాట్లాడానని.. ఆయన తోటి నటీనటులకు ఏదో ఒకటి చేస్తారన్న నమ్మకం తనకు ఉందని అన్నారు.
ఇక రాజశేఖర్ నటించిన శేఖర్ సినిమా విషయానికి వస్తే.. కథ సరిగ్గా ఉండాలే కానీ రాజశేఖర్ ఎలాంటి సినిమా అయినా చేస్తారని స్పష్టం చేశారు. శేఖర్ సినిమాకు తాము చాలా కష్టపడ్డామని.. సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్, డైలాగ్స్, రీ రికార్డింగ్ పనులను తమ కుమార్తెలు కూడా చూసుకున్నారని స్పష్టం చేశారు. శేఖర్ సినిమా చాలా బాగా వచ్చిందని.. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని.. ఎమోషనల్‌గా సాగుతుందని తెలిపారు. ఇక ఈ మూవీ మే 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…