Honey Rose : క్రాక్ సినిమా దర్శకుడు గోపీచంద్ మలినేని బాలయ్యతో ఓ సినిమా చేస్తున్న విషయం విదితమే. ఎన్‌బీకే107 వర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇందులో బాలకృష్ణ డ్యుయల్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక శృతి హాసన్‌ను ఇప్పటికే ఈ సినిమాకు హీరోయిన్ గా ఎంపిక చేశారు. అయితే ఇందులో రెండో హీరోయిన్ ను ఎంపిక చేసేందుకు చిత్ర యూనిట్ ఇప్పటికే అనేక ప్రయత్నాలు చేసింది. ఓ దశలో సీనియర్ హీరోయిన్ మీరా జాస్మిన్‌ను తీసుకోవాలని అనుకున్నారు. కానీ ఆ ప్రయత్నాలు ఫలించలేదు.
మీరా జాస్మిన్ వయస్సు 40 ఏళ్లకు పైనే. అయినప్పటికీ ఈ మధ్య కాలంలో ఆమె చేస్తున్న గ్లామర్ షో అంతా ఇంతా కాదు. అయితే బాలకృష్ణ సినిమాలో నటించేందుకు ఈ బ్యూటీ నో చెప్పిందట. తాను గ్లామరస్ రోల్స్ చేయాలని అనుకుంటున్నానని.. బాలకృష్ణ సినిమాలో చేయనుంది ఫ్యామిలీ పాత్ర. ఫ్లాష్ బ్యాక్‌లో బాలకృష్ణకు తల్లిగా చేయాలి. కనుక ఆ పాత్ర చేయనని ఆమె చెప్పిందట. దీంతో మళ్లీ హీరోయిన్ వేట మొదలు పెట్టారు. అయితే ఎట్టకేలకు ఈ మూవీకి రెండో హీరోయిన్‌ను ఎంపిక చేశారు. నటి హనీ రోజ్ వర్గీస్‌ను ఇందులో సీనియర్ బాలకృష్ణకు జోడీగా నటింపజేయనున్నారు. ఇందుకు ఆమె కూడా ఓకే చెప్పిందట. దీంతో త్వరలోనే ఈమె పార్ట్‌ను చిత్రీకరించనున్నారు.
ఇక హనీ రోజ్ వర్గీస్ తెలుగు తెరకు కొత్తేమీ కాదు. గత 14 ఏళ్ల కిందట వచ్చిన శివాజీ ఆలయం సినిమాలో ఈమె నటించింది. అలాగే పలు తెలుగు చిత్రాల్లోనూ ఈమె నటించింది. కానీ పెద్దగా గుర్తింపు రాలేదు. దీంతో ఈమె మళయాళంలో స్థిరపడింది. అక్కడ పలు హిట్ చిత్రాల్లో నటించింది. దీంతో ఆమెకు అక్కడ మంచి గుర్తింపే వచ్చింది. అయితే తెలుగులో ఈ మూవీతో మళ్లీ ఇక్కడికి వచ్చి ఇక్కడి సినిమాల్లో ఆఫర్లను అందిపుచ్చుకోవాలని ఈ భామ అనుకుంటుందట. అందుకనే బాలయ్య సినిమా అనగానే ఠక్కున ఓకే చేసిందట. ఇక ఈ మూవీకి అన్నగారు అనే టైటిల్‌ను దాదాపుగా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇందులోంచి విడుదలైన బాలయ్య ఫస్ట్ లుక్ ఇప్పటికే ఫ్యాన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…