Chintha Chiguru : మనకు ఈ సీజన్‌లో ఎక్కడ చూసినా సరే చింత చిగురు అధికంగా లభిస్తుంది. దీన్ని చాలా మంది పప్పు లేదా పచ్చడి రూపంలో తయారు చేసుకుని తింటుంటారు. ఈ వంటకాలు ఎంతో రుచిగాఉంటాయి. అయితే కేవలం రుచిని మాత్రమే కాదు.. చింత చిగురు మనకు ఆరోగ్యకరమైన ప్రయోజనాలను కూడా అందిస్తుంది. దీన్ని తీసుకోవడం వల్ల ఎలాంటి అద్భుతమైన లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
చింత చిగురులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దీంతో సీజనల్ గా వచ్చే వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చు. ముఖ్యంగా దగ్గు, జలుబు తగ్గుతాయి. ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయి.
చింత చిగురులో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. ఇది రక్తం బాగా తయారయ్యేలా చేస్తుంది. రక్తహీనతను తగ్గిస్తుంది. అలాగే దీంట్లో ఉండే పోషకాల వల్ల పాలిచ్చే తల్లులు దీన్ని తింటే వారిలో పాలు బాగా ఉత్పత్తి అవుతాయి. మహిళలు దీన్ని తింటే నెలసరి సమయంలో వచ్చే సమస్యలు తగ్గుతాయి. హార్మోన్లు సరిగ్గా పనిచేస్తాయి.
చింత చిగురులో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలు ఉంటాయి. అందువల్ల నొప్పులు, వాపులు తగ్గుతాయి. ముఖ్యంగా కీళ్ల నొప్పులు ఉన్నవారికి మేలు జరుగుతుంది. చింత చిగురులో ఉండే విటమిన్ సి దంతాలను, చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. చిగుళ్ల నుంచి అయ్యే రక్తస్రావం తగ్గుతుంది. నోటి దుర్వాసన నుంచి ఉపశమనం లభిస్తుంది.
మలేరియా జ్వరం వచ్చిన వారు చింత చిగురు తింటే త్వరగా కోలుకుంటారు. అలాగే పచ్చకామెర్లకు, మధుమేహం ఉన్నవారికి కూడా ఇది మెడిసిన్‌లా పనిచేస్తుంది. దీంతో ఆయా సమస్యల నుంచి బయట పడవచ్చు. ఇక చింత చిగురును కాస్త తీసుకుని దంచి ముద్దలా చేసి కట్టు కడుతుంటే గాయాలు, పుండ్లు త్వరగా మానుతాయి. ఇలా చింత చిగురు మనకు ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. కనుక ఇది ఎక్కడ కనిపించినా అసలు విడిచిపెట్టకుండా తినాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…