ఆంధ్రప్రదేశ్ లో చికెన్ ధరలు చుక్కలను తాకుతున్నాయి. కిలో చికెన్ ధర దాదాపు 300 రూపాయలు పలుకుతుంది. గతంలో ఎప్పుడూ లేనివిధంగా చికెన్ ఈ విధంగా రేటు పెరగడానికి గల కారణం బర్డ్ ఫ్లూ అని చెప్పవచ్చు. బర్డ్ ఫ్లూ కారణంగా గతంలో చికెన్ కొనేవారు లేకపోవడంతో చికెన్ ధరలు అమాంతం పడిపోయాయి. పైగా కోళ్ల ఉత్పత్తి కూడా తగ్గిపోయింది.
![](https://i0.wp.com/indiadailylive.com//wp-content/uploads/2021/04/istockphoto-479986424-612x612-1-300x216.jpg?resize=904%2C651&ssl=1)
గత కొద్దిరోజుల నుంచి సమ్మర్ ప్రారంభం కావడంతో చికెన్ తినే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది.ఈ విధంగా వినియోగదారులు పెరగడంతో వారికి సరిపడా కోళ్ళు అందుబాటులో లేకపోవడం వల్ల చికెన్ ధరలు అమాంతం చుక్కలను తాకాయని అని చెప్పవచ్చు. ఇకపోతే ఏప్రిల్, మే నెలలో చికెన్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు.
ఏప్రిల్, మే నెలలో పెళ్లిళ్లు అధిక సంఖ్యలో ఉండటం వల్ల చికెన్ కి బాగా డిమాండ్ పెరుగుతుందని, ఆ డిమాండ్ కి అనుగుణంగా కోళ్ళు అందుబాటులో లేకపోతే చికెన్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉంటుందని పౌల్ట్రీ నిపుణులు హెచ్చరిస్తున్నారు.