టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి సంబంధించిన సరికొత్త ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతోంది.”స్ట్రాంగ్ మార్నింగ్.. కాంట్ స్టార్ట్ బెటర్”అంటూ రామ్ చరణ్ జిమ్ లో దిగిన ఫోటోను తన ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేశారు. ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఎంతో మంది అభిమానులను ఆకట్టుకుంది.
ఇక సినిమాల విషయానికొస్తే రామ్ చరణ్ తేజ్ దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో “ఆర్ఆర్ ఆర్” సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నారు. అదేవిధంగా ఈ సినిమాలో కొమరం భీమ్ పాత్ర ద్వారా ఎన్టీఆర్ సందడి చేయనున్నట్లు మనకు తెలిసిందే.
అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపిస్తున్న రామ్ చరణ్ కి జోడీగా సీత పాత్రలో బాలీవుడ్ భామ అలియాభట్ నటించనున్నారు. రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్నారు.షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా అక్టోబర్ 13న దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు అధికారిక విడుదల తేదీని కూడా ప్రకటించారు.