Chandramukhi : సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన చంద్రముఖి మూవీ ఎంతటి హిట్ ను సాధించిందో అందరికీ తెలిసిందే. ఇందులో నయనతార ఆయనకు జోడీగా నటించింది. అలాగే ప్రభు, జ్యోతిక ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. లేడీ ఓరియెంటెడ్ సినిమా అయినప్పటికీ రజనీకాంత్ ఇందులో అద్భుతంగా నటించారు. ఈ క్రమంలోనే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అయితే త్వరలోనే ప్రేక్షకుల ముందుకు చంద్రముఖి 2 రానుంది. ఈ మేరకు మేకర్స్ లైకా ప్రొడక్షన్స్ అధికారికంగా వివరాలను వెల్లడించారు.
చంద్రముఖి వచ్చి 17 ఏళ్లు అవుతోంది. అప్పట్లో తమిళం, తెలుగులోనే ఈ మూవీ రిలీజ్ అయింది. అయితే తాజాగా చంద్రముఖి 2ను తీస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అప్పటి దర్శకుడు పి.వాసు నే ఈ మూవీకి కూడా దర్శకత్వం వహించనున్నారు. అయితే ఇందులో రజనీకాంత్ కాకుండా రాఘవ లారెన్స్ లీడ్ రోల్‌లో నటించనున్నారు. ఈ మేరకు లైకా ప్రొడక్షన్స్ తెలియజేసింది. అయితే అప్పట్లో పి.వాసు వెంకటేష్‌తో కలిసి నాగవల్లి సినిమా తీశారు. కానీ ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయింది. అయితే ఇప్పుడు మాత్రం చంద్రముఖి 2 పేరిట సినిమా తీయనున్నారు.

ఇక హార్రర్ సినిమాలను తీయడంలో రాఘవ లారెన్స్ ఎంతో పేరుగాంచారు. గతంలో ఆయన తీసిన గంగ, కాంచన వంటి చిత్రాలు హిట్ అయ్యాయి. అందుకనే ఆయనను ఈ సినిమాలో లీడ్ రోల్‌లో నటింపజేయిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులో నటించనున్న ఇతర నటీనటులు, సాంకేతిక సిబ్బంది, ఇతర వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు. ఇక చంద్రముఖ 2 పోస్టర్‌ను కూడా లాంచ్ చేశారు. త్వరలోనే మరిన్ని వివరాలను వెల్లడించనున్నారు.