Chalaki Chanti : బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 సెప్టెంబర్ 4 నుండి స్టార్ మా లో ప్రసారం కానున్న సంగతి అందరికీ తెలిసిందే. గత నెల రోజుల నుండే సోషల్ మీడియాలో రకరకాల చర్చలతో ఎంతో ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. అంతే కాకుండా ఆ షోలో పాల్గొనబోయే కంటెస్టెంట్లు వీరే అంటూ వివిధ వ్యక్తుల పేర్లు కూడా అనేక మాధ్యమాల ద్వారా ఇప్పటికే ప్రచారంలో ఉన్నాయి. ఇక ఇప్పుడు ఈ లిస్ట్ లోకి మరో ఇద్దరు నటుల పేర్లు చేరినట్లు కొన్ని విశ్వనీయ వర్గాల సమాచారం.
బిగ్ బాస్ సీజన్ 6 లో పాల్గొనబోయేవారిలో నటి అభినయ శ్రీ కూడా ఒక స్టార్ కంటెస్టెంట్ లా బరిలోకి దిగబోతున్నట్టు మనకు ఇదివరకే తెలిసింది. అయితే ఇప్పుడు జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో పాపులరిటీ సంపాదించుకున్న చలాకీ చంటి కూడా బిగ్ బాస్ లోకి రాబోతున్నట్టు దాదాపుగా ఖరారైపోయిందని అంటున్నారు. ఇక ప్రతి సీజన్ లో జబర్దస్త్ షో నుండి ఎవరో ఒకరు బిగ్ బాస్ హౌజ్ లోకి ప్రవేశించడం ఆనవాయితీ గా మారిపోయింది. ఈ సారి ఆ అవకాశం చలాకీ చంటి కి దక్కిందని తెలుస్తోంది.
అలాగే వాసంతి కృష్ణన్ అనే తమిళ బ్యూటీ కూడా మరొక కంటెస్టెంట్ గా బిగ్ బాస్ సీజన్ 6 లో రాబోతున్నట్టు సమాచారం అందుతోంది. ఈమె ఇప్పుడిప్పుడే చిన్న చిన్నగా సినీ అవకాశాలు అందుకుంటూ పైకి ఎదుగుతున్న నటి అని తెలిసింది. ఈ మధ్యే పండు గాడ్ మోస్ట్ వాంటెడ్ అనే తెలుగు సినిమాలో చిన్న పాత్రలో మెరిసింది. కానీ దాని వలన పెద్దగా గుర్తింపు రాలేదు. ఇక ఈమెకు ఇన్ స్టా లో ఫాలోవర్లు కూడా బాగానే ఉన్నారు. అందులో వాసంతి తన హాట్ హాట్ ఫోటోలను రెగ్యులర్ గా షేర్ చేస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు బిగ్ బాస్ ద్వారా తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…