Manoj Desai : విజయ్ దేవరకొండ ఎప్పుడూ తన ప్రవర్తనతో వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు. అది దూకుడు స్వభావంతో కానివ్వండి లేదా పరిణతి చెందిన వ్వక్తిగా కానివ్వండి, ఏదైనా ఆయనకు ఆయనే సాటి. ఇప్పుడు ఈ విషయం మరొకసారి రుజువైంది. అయితే ఇటీవల ముంబయిలోని జీ7 అనే మల్టీప్లెక్స్ యజమాని అయిన మనోజ్ దేశాయ్ అనే అతను లైగర్ సినిమా విడుదలపై కామెంట్ల విషయంలో విజయ్ ని తీవ్రంగా విమర్శించిన విషయం తెలిసిందే. నీ వల్ల మా అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్లు పడిపోయాయి, నీకు బాగా పొగరు, నీకు అంత తలతిక్క ఉంటే నీ సినిమాలను ఓటీటీలో మాత్రమే విడుదల చేసుకో అంటూ విజయ్ దేవరకొండపై ఆయన చేసిన విమర్శలు పెద్ద దుమారం రేపాయి.
అయితే ఆయన ఇలా మాట్లాడిన వీడియో విజయ్ దేవరకొండ వద్దకు చేరింది. దీంతో నష్ట నివారణ చేయదలచుకున్న విజయ్ నేరుగా ముంబై వెళ్లి ఆయను కలవడం జరిగింది. అలా కలిసిన విజయ్ ఆయనతో మాట్లాడుతూ.. అసలు తను మీడియాతో మాట్లాడిన విషయం వేరని కానీ దానిలో చిన్న ముక్కను తీసుకొని ప్రచారం చేయడంతో అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారని ఆ థియేటర్ ఓనర్ కి తన మనసులోని మాటను చెప్పాలనుకున్నట్టుగా అన్నాడు. ఇంకా తను ఎప్పడూ ప్రేక్షకులను తక్కువ చేసి మాట్లాడనని, వారి వల్లే తను ఈ స్థాయికి వచ్చానని, వారంటే తనకు ఎంతో ప్రేమ, గౌరవం అని అన్నాడు. అలాగే మీలాంటి పెద్ద వ్యక్తుల ఆశీర్వాదం తనకు కావాలని విజయ్ ఆ థియేటర్ యజమాని కాళ్లకు మొక్కాడు.
దీంతో ఆ థియేటర్ యజమాని కూడా విజయ్ ఇచ్చిన వివరణతో ఏకీభవించాడు. ఇక ఆయన మాట్లాడుతూ ఇందులో విజయ్ తప్పు ఏమీ లేదని అతను చాలా మంచి వ్యక్తి అని, తనది ఒదిగి ఉండే స్వభావమని, వినయ విధేయతలు గల మనిషి అనీ, ఇకపై విజయ్ సినిమాలన్నీ తన థియేటర్ లో విడుదల చేస్తానని విజయ్ ని పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేసాడు. ఇంకా తాను ఎప్పుడూ ఎవరికీ సారీ చెప్పలేదనీ కానీ విజయ్ కి చెబుతున్నాని అన్నాడు. దీంతో విజయ్ తన గొప్ప వ్యక్తిత్వాన్ని మరొకసారి నిరూపించాడని, ఇంతటితో ఈ వివాదానికి తెర పడిందని సినీ వర్గాల అభిప్రాయంగా తెలుస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…