Divorce : ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీలో విడాకులు అనే పదం చాలా సాధారణం అయిపోయింది. ఒకరి తర్వాత ఒకరు సెలబ్రిటీ కపుల్స్ విడాకులు తీసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. గత రెండు సంవత్సరాల నుంచి విడాకులు తీసుకునే భార్య భర్తల సంఖ్య ఎక్కువైపోతుంది. గత ఏడాది అక్టోబర్ లో టాలీవుడ్ మోస్ట్ రొమాంటిక్ కపుల్ సమంత, నాగచైతన్య మేము విడాకులు తీసుకోబోతున్నాం అంటూ సడెన్ గా ప్రకటించి అభిమానుల గుండెలలో ఒక్కసారిగా బాంబు పేల్చారు.
ఆ తర్వాత కొన్ని నెలలకే తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్ పెద్ద కూతురు ఐశ్వర్య, హీరో ధనుష్ కూడా విడాకులు తీసుకొని ఇదే కోవలోకి వెళ్లిపోయారు. వీరు విడాకులు తీసుకుని దాదాపు నెలలు గడుస్తున్నా అభిమానులు ఇంకా ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అసలు కారణాలు బయటకు రాకపోయినా సోషల్ మీడియాలో మాత్రం వార్తలు ఈ జంటలపై వైరల్ అవుతున్నాయి. వీరు మాత్రమే కాకుండా ఆ తర్వాత అనేక జంటలు విడాకులు తీసుకుని వివాహ బంధానికి స్వస్తి చెప్పి కొత్త జీవితాన్ని స్టార్ట్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా మరో సమాచారం వినిపిస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం త్వరలో ఓ టాలీవుడ్ స్టార్ ఫ్యామిలీలో మరో జంటకువిడాకులు మంజూరు కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ బడా ఫ్యామిలీలో ఒకటైన మరో స్టార్ ఫ్యామిలీకి చెందిన హీరో కి వరుసకి అన్న అయ్యే ఓ వ్యక్తి విడాకులు తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది. అంతేకాదు ఇతను స్టార్ హీరో బ్రదర్ అయినా సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా ప్రముఖులతో పరిచయాలు ఉన్నాయి.
భార్యతో కొన్ని మనస్పర్ధలు కారణంగా మాటా మాటా పెరిగి ఇరువురి మధ్య మనస్పర్ధలు ఎక్కువ కావడంతో విడాకులు తీసుకోవడానికి సిద్ధమయ్యారట. ఇరువైపుల పెద్దలు నచ్చచెప్పడానికి చూసినా కూడా జంట విడిపోవడమే మంచిదనే పూర్తిస్థాయిలో డెసిషన్ తీసుకున్నారట. ప్రస్తుతానికి వాళ్ల పేర్లు గోప్యంగా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం ఒక స్టార్ హీరో బ్రదర్ విడాకులు తీసుకొబోతున్నారు అనే విషయం హాట్ టాపిక్ గా మారింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…