Samantha : తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న సమంత, నాగచైతన్యలు తమ వివాహబంధానికి ఎండ్ కార్డ్ వేశారు. ఈ క్రమంలో సామ్ విడాకులకు కారణాలు ఇవేనంటూ సోషల్ మీడియాలో ఆమె స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్ పై విపరీతంగా మండిపడ్డారు. వీరిద్దరి ఫోటోలను కూడా నెట్టింట్లో పోస్ట్ చేసి తెగ ట్రోల్ చేశారు. ఈ ఇష్యూపై గతంలో సమంత పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్ సాధనా సింగ్ రెస్పాన్డ్ అయ్యి ప్రీతమ్, సమంతను అక్కా అని పిలుస్తారని క్లారిటీ ఇచ్చింది. లేటెస్ట్ గా ప్రీతమ్ జుకల్కర్ మీడియాతో మాట్లాడుతూ.. సమంతను ఎంతో అభిమానంతో అక్కా అని పిలుస్తానని తెలిపారు.
ఈ విషయం చాలామందికి తెలుసని అలాంటిది మా మధ్య అఫైర్ ఎలా ఉంటుందని అన్నారు. అలాగే ఐ లవ్ యూ అంటూ ఎందుకు మెసేజ్ చేశారని సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయని, ఇంట్లో ఉన్న తల్లికి, సోదరిగా భావించే వారికి ఐ లవ్ యూ అని చెప్పడం ఎలా తప్పవుతుందని అన్నారు. ఇంటి నుండి బయటకు వస్తే చంపేస్తామని, కెరీర్ ను నాశనం చేస్తామని బెదిరిస్తున్నారని విపరీత ధోరణిలో మాట్లాడుతున్నారని అన్నారు.
సమంతతోపాటుగా నాగచైతన్యకు కూడా తనతో ఎన్నో ఇయర్స్ నుండి పరిచయం ఉందని, సమంతకు, తనకు మధ్య ఉన్న రిలేషన్ గురించి చైతన్యకు స్పష్టంగా తెలుసని ప్రీతమ్ అన్నారు. ఈ విషయంలో నాగచైతన్య స్పందించకపోవడం బాధాకరం అని.. ఇప్పటికైనా ఆయన మాట్లాడాలని అన్నారు. బ్రతికున్న అమ్మ చనిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారని ప్రీతమ్ ఆవేదన వ్యక్తం చేశారు. నాగచైతన్య, మీడియాకి, నెటిజన్లకు అసలైన నిజం ేంటో క్లారిటీ ఇవ్వాలని కోరారు. ప్రస్తుత పరిస్థితుల్లో సమంత విడాకుల కారణంగా తీవ్రమైన ఒత్తిడిలో ఉందని తనకు సపోర్ట్ గా ఉంటానని ప్రీతమ్ తెలిపారు.