Mohan Babu : రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ వేడుకల్లో నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. తరువాత ఆ వ్యాఖ్యలకు వైసీపీ మంత్రులు కౌంటర్ ఇచ్చారు. అలాగే మధ్యలో పోసాని కలగజేసుకుని తనకు ఎంతో ఇష్టమైన నేత మంత్రి పేర్ని నానిపై పవన్ చేసిన వ్యాఖ్యలకు పోసాని గట్టిగానే సమాధానం ఇచ్చారు. తరువాత ఈ వివాదం సద్దుమణిగింది.
అయితే రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ వేడుకల్లో మోహన్ బాబుపై పవన్ వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం జగన్ మీ బంధువే కదా.. ఆయనతో మాట్లాడి చిత్ర పరిశ్రమకు న్యాయం చేయవచ్చు కదా.. లేదంటే సీఎం జగన్ మీ విద్యావ్యవస్థలోకి కూడా వచ్చేస్తారు.. అంటూ పవన్.. మోహన్‌బాబుపై విమర్శలు చేశారు.
అయితే అప్పుడు మా ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. దీంతో పవన్ చేసిన విమర్శలకు మోహన్ బాబు కూల్‌గానే సమాధానం ఇచ్చారు. తమ్ముడూ పవన్.. చాలా రోజులకు నన్ను వివాదంలోకి లాగావు. కానీ నీ మాటలకు స్పందించాల్సిన సమయం ఇది కాదు.. మా ఎన్నికల తరువాత ఆ విషయంపై మాట్లాడుతా.. అంటూ మోహన్‌బాబు రిప్లై ఇచ్చారు.
అయితే ఇప్పుడు మా ఎన్నికలు ముగిశాయి.. మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు మా అధ్యక్షుడు అయ్యారు.. దీంతో అందరి చూపు మోహన్ బాబుపై పడింది. ఆయన పవన్ చేసిన వ్యాఖ్యలపై మాట్లాడుతారా ? లేదా ? ఒకవేళ మాట్లాడితే మోహన్ బాబు ఏం చెబుతారు ? అన్న విషయాలు ఆసక్తికరంగా మారాయి. ఇక మోహన్ బాబు స్పందన కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.