Business Idea : సంప్రదాయ పంటలతో రైతులకు పెద్దగా లాభాలు రావడం లేదు. పైగా భారతదేశ వ్యవసాయం వర్షాధారితం కావడంతో నష్టాలు తప్పడం లేదు. అందుకు ప్రత్యామ్నాయంగా కొంతమంది రైతులు విభిన్న మార్గాలను ఎంచుకుంటూ భారీగా సంపాదిస్తున్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలో ఎక్కువమంది నర్సరీల ఏర్పాటుపై ఆసక్తి చూపుతున్నారు. ఎకరం విస్తీర్ణంలో షేడ్ నెట్లు ఏర్పాటు చేసి కూరగాయల నారును పెంచుతూ రైతుల అవసరాలు తీరుస్తున్నారు. కూరగాయలు సాగు చేయాలంటే రైతులు ముందుగా నారును సిద్ధం చేసుకోవాలి. ఇందుకోసం గతంలో రైతులు తమ పొలాల వద్ద నారుమడులు సిద్ధం చేసుకునేవారు.
ప్రతికూల పరిస్థితులు తలెత్తితే సరిగ్గా ఎదగక పాడైపోయేవి. ప్రస్తుతం ఈ నర్సరీలు వచ్చాక రైతులకు మేలు జరుగుతోంది. ఒక ఎకరా విస్తీర్ణంలో నర్సరీ ఏర్పాటు చేస్తే రూ 90 వేల వరకు ఖర్చు అవుతుండగా సీజన్లో నెలకు రూ.50 వేల నుంచి రూ. లక్ష రూపాయల వరకు ఆదాయం ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు. ఎక్కువగా టమాటా, వంకాయ, క్యాబేజీ, మిరప నారును పెంచుతున్నారు. టమాటా, క్యాబేజీ, క్యాలీ ఫ్లవర్ విత్తనాలు మొలకెత్తడానికి 3 నుంచి 4 రోజుల సమయం పడుతుండగా.. పొలాల్లో నాటేందుకు 15 నుంచి 20 రోజుల సమయం పడుతుంది. మిరప వంకాయ 25 రోజుల నుంచి 30 రోజులకు అందుబాటులోకి వస్తాయి.
కల్తీ విత్తనాల ద్వారా నారు, నాణ్యత లేని నారు పెంపకాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం నర్సరీ యాక్టును తీసుకువచ్చింది. నిర్వాహకులు ఇందులో తమ వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. యువ రైతు జశ్వంత్ రెడ్డి మాట్లాడుతూ.. నర్సరీలో అన్ని రకాల కూరగాయల నారును పెంచుతున్నాం. రైతుల అవసరాల మేరకు పూర్తిస్థాయిలో నారును అందుబాటులో ఉంచి, తక్కువ ధరకే అందిస్తున్నాం. నర్సరీ ద్వారా నేను ఉపాధి పొందడమే కాకుండా, 10 మందికి ఉపాధి కల్పిస్తున్నాను అని తెలిపాడు. కరీంనగర్ జిల్లాలో తిమ్మాపూర్లోనే 21 నర్సరీలున్నాయి. ప్రభుత్వం కొన్ని నియమ నిబంధనలను విధించింది. ప్రతీ నిర్వాహకుడు వాటికి అనుగుణంగానే నర్సరీలను నడపాలని ఉద్యానవనశాఖ అధికారి స్వాతి తెలిపారు.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…