Vetagadu Movie : వేట‌గాడు సినిమా చేసేందుకు శ్రీ‌దేవి మొద‌ట ఒప్పుకోలేద‌ట‌.. త‌రువాత ఏమైందంటే..?

Vetagadu Movie : నటన మీద మక్కువతో ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎన్నో సమస్యలను ఎదుర్కొని, కష్టపడి ఇండస్ట్రీలో స్టార్ నటుడిగా, అభిమానుల దేవుడిగా మారిన హీరో ఎవరైనా ఉన్నారు అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది నటసార్వభౌమ నందమూరి తారక రామారావు. పౌరాణిక, జానపద, సాంఘికం ఇలా ఎన్నో చిత్రాల్లో నటించి ఎన్టీఆర్ ఒక సపరేట్ ట్రెండ్ ని సెట్ చేసారు. వరుస విజయాలతో ప్రతీ ఏటా దాదాపు పదుల సినిమాలు విడుదల చేస్తూ బిజీగా గడిపారు.

అప్పటిలో ఎన్టీఆర్ తో సినిమాలలో కలిసి నటించడానికి ఎంతో మంది హీరోయిన్లు తాపత్రయపడేవారు. ఎన్టీఆర్ తో నటించడానికి ఒక్క అవకాశం వస్తే చాలని అనుకునేవారు. 1970 తర్వాత ఎన్టీఆర్ రేంజ్ బాగా పెరిగిపోయింది. ఆయన సినిమాలను చూడటానికి జనాలు ఎలాంటి వాహన సౌకర్యం లేని రోజులలో కిలోమీటర్ల దూరం నడిచి వెళ్ళే వాళ్ళు. ఇక ఆ సమయంలో దర్శకుడు రాఘవేంద్రరావు ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి ఒక కథ సిద్ధం చేసుకున్నారు. ఆ సినిమానే వేటగాడు. ఈ సినిమా సాధించిన విజయం ఇప్పటికి కూడా ఒక సంచలనం అని చెప్పవచ్చు.

అయితే వేటగాడు సినిమాకు అన్నీ సిద్ధంగా ఉన్నాయి. కానీ హీరోయిన్ గా ఎవరిని తీసుకోవాలి అని చాలా రోజుల వరకూ ఒక స్పష్టత రావడం లేదట. రాఘవేంద్రరావు మాత్రం హీరోయిన్ విషయంలో శ్రీదేవి అనే మాట తప్ప మరో మాట మాట్లాడటం లేదట. వేటగాడు సినిమా నిర్మాత అర్జున రాజు మాత్రం ఆమెను వద్దంటే వద్దని కచ్చితంగా చెప్పేశారట. ఎన్టీఆర్ పక్కన శ్రీదేవి మరీ చిన్న పిల్లలా ఉంటుందని వద్దంటున్నారట.

ఇక దర్శకుడు రాఘవేంద్రరావు మాత్రం ఈ సినిమాలో శ్రీదేవి హీరోయిన్ గా ఒప్పించడానికి నానా కష్టాలు పడ్డారు. శ్రీదేవి కూడా ఎన్టీఆర్ పక్కన చేయడానికి ఇష్టం చూపించలేదు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా అనుకోవడం చివరికి ఎన్టీఆర్ వద్దకు వెళ్ళింది. నిర్మాతలను పిలిచి మాట్లాడిన ఎన్టీఆర్ అసలు విషయం అడిగితే.. 5 ఏళ్ళ క్రితం మీ పక్కన బడిపంతులు చిత్రంలో మనవరాలిగా నటించింది.. ఇప్పుడు ఆమెను హీరోయిన్ అంటే జనాలు రిసీవ్ చేసుకునే స్థితిలో ఉండరు. ఈ విషయంపై ఎన్టీఆర్  స్పందించి సినిమాల్లో నటించే వారికి సెంటిమెంట్ లు చూడకండి.

ప్రేక్షకులు దేవుళ్ళుతో సమానం. వాళ్ళు అన్నీ మంచిగా రిసీవ్ చేసుకుంటారు. మీకు ఎందుకు బాధ, నాదీ బాధ్యత. అంతేకాకుండా మీకు ఫ్రీ పబ్లిసిటీ చేసి పెడతా అని హామీ కూడా ఇచ్చారట. సినిమా కథాంశం బలంగా ఉండాలి గాని ఇవన్నీ ఎందుకు అన్నారట. శ్రీదేవిని కూడా ఆయనే స్వయంగా ఒప్పించటం జరిగింది. ఫైనల్ గా వేటగాడు సినిమా తెరపైకి వచ్చి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.  ఈ సినిమాతో ఎన్టీఆర్, శ్రీదేవి జోడి బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకున్నారు.  ఆ సినిమా హిట్ తర్వాత ఇద్దరి కాంబినేషన్ లో ఎన్నో హిట్ సినిమాలు విడుదలై  ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.

Share
Mounika

Recent Posts

ఈ ఫుడ్ తింటే ఊపిరితిత్తులు నెల రోజుల్లో పూర్తి ఆరోగ్యంగా మారుతాయి..!

మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్య‌మైన‌వో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…

Monday, 23 September 2024, 5:22 PM

రోడ్డుపై కుక్క‌లు మిమ్మ‌ల్ని వెంబ‌డిస్తే ఆ స‌మ‌యంలో ఏం చేయాలి అంటే..?

ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మ‌రింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…

Saturday, 21 September 2024, 3:01 PM

క‌లెక్ష‌న్ల‌లో దుమ్ము రేపుతున్న స్త్రీ 2 మూవీ.. బాలీవుడ్ లో ఆల్‌టైమ్ హై రికార్డు..!

సాహో చిత్రంలో ప్ర‌భాస్ స‌ర‌స‌న కథానాయిక‌గా న‌టించి అల‌రించిన శ్ర‌ద్ధా క‌పూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో ప‌ల‌క‌రించింది. 2018లో…

Saturday, 21 September 2024, 5:47 AM

జానీ మాస్ట‌ర్ కేసులో అస‌లు ఏం జ‌రుగుతోంది..?

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో ప‌డ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మ‌హిళా…

Friday, 20 September 2024, 9:27 PM

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ఇప్పుడు త‌న రిలేష‌న్ ఎలా ఉందో చెప్పిన ఆలీ..!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాన్ ఇటు రాజ‌కీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…

Friday, 20 September 2024, 9:42 AM

డీమోంట్ కాల‌నీ 2 ఓటీటీలోకి వ‌చ్చేస్తుంది.. ఎక్క‌డ, ఎప్పుడు అంటే..!

హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విష‌యం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…

Thursday, 19 September 2024, 1:55 PM

పొలంలో రైతుకి దొరికిన రూ.5ల‌క్షల విలువైన వ‌జ్రం.. ఏకంగా జాక్ పాట్ త‌గిలిందిగా..!

ఒక్కోసారి ఎవ‌రిని ఎప్పుడు అదృష్టం ఎలా వ‌రిస్తుందో తెలియ‌దు. ఊహించ‌ని విధంగా ల‌క్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…

Wednesday, 18 September 2024, 10:46 AM

భ‌ర్త రోజూ స్నానం చేయ‌డం లేద‌ని ఏకంగా విడాకులు కోరిన భార్య‌

ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొన‌సాగ‌డం లేదు. ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండ‌గా,ఆ పెళ్లి…

Wednesday, 18 September 2024, 9:12 AM