Kantara Movie : కాంతారా మూవీ ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ప్రస్తుతం దుమ్ములేపుతోంది. ఏకంగా కేజీఎఫ్, ఆర్ఆర్ఆర్ మూవీల రికార్డులను సైతం బ్రేక్ చేస్తోంది. ఐఎండీబీలో కేజీఎఫ్ -2 మూవీకి 8.4 రేటింగ్ రాగా, కాంతారా మూవీకి ఏకంగా 9.5 రేటింగ్‌తో అదరగొడుతోంది. కన్నడ సంచలనం రిషబ్ శెట్టి ఇందులో హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం కూడా వహించాడు. కన్నడలో ఇటీవల రిలీజ్ అయిన కాంతారా చిత్రం అక్టోబర్ 15న తెలుగుతో పాటు పలు భాషల్లో రిలీజ్ అయ్యింది. మొదటి రోజే ఈ మూవీ సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.
క్రిటిక్స్ అయితే ఈ మూవీతో లవ్ లో పడిపోయినట్టు కామెంట్స్ చేశారు. దీంతో మార్నింగ్ షోలు ఈవెనింగ్ షోలు డల్ గా స్టార్ట్ అయినా ఈవెనింగ్ షోల నుండి తిరుగు లేకుండా పోయింది. కాంతార చిత్ర తెలుగు హక్కులను నిర్మాత అల్లు అరవింద్ కొన్నారు. ఈ క్రమంలో ఆయన భారీ ఎత్తున లాభాలు గడించనున్నారు. కాంతార రైట్స్ కేవలం రూ. 2 కోట్లకు కొన్నట్లు సమాచారం. మొదటిరోజే ఈ మూవీ రూ. 2 కోట్ల షేర్ రాబట్టింది. వరల్డ్ వైడ్ రూ. 5 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. సెకండ్ డే ఓపెనింగ్ డేకి మించి వసూళ్లు నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఫుల్ రన్ లో కాంతార రూ. 10 కోట్లకు పైగా షేర్ వసూలు చేయవచ్చనేది ట్రేడ్ వర్గాల అంచనా.
మొత్తంగా అల్లు అరవింద్ డబ్బింగ్ మూవీతో పెట్టుబడికి ఐదారు రెట్ల లాభం పొందనున్నారు. ఈ చిత్రం తెలుగు, మలయాళ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కన్నడ మాదిరిగానే ఇతర భాషల్లో కూడా ఈ చిత్రం సంచలనాలను నమోదు చేస్తుంది. థియేటర్స్ లో కూర్చున్న ప్రతి ప్రేక్షకుడిని ఈ సినిమా కట్టిపడేస్తుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరు కాంతార క్లైమాక్స్ గురించి ప్రస్తావించకుండా ఉండలేరు. ఇప్పటికే కన్నడలో సంచలనం సృష్టించిన ఈ చిత్రం, తెలుగు లో కూడా అదే మాదిరిగా విజయఢంకా మోగిస్తుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…