Bigg Boss Telugu 6 : బిగ్ బాస్ తెలుగు సీజ‌న్ 6 కంటెస్టెంట్ల ఫైన‌ల్ లిస్ట్ ఇదే..?

Bigg Boss Telugu 6 : టీవీ షోల్లో తిరుగులేని షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. ఇలాంటి షోలు మొదట విదేశాల్లో ఉండేవి. అక్కడ సూపర్ హిట్ అవ్వడంతో ఇండియాలో ప్రారంభించారు. మొదట నార్త్ లో ఈ షోని ప్రారంభించారు. అక్కడ కూడా మంచి క్రేజ్ సంపాదించడంతో అన్ని దక్షిణాది రాష్ట్రాల్లో బిగ్ బాస్ ని ప్రారంభించారు. ఇప్పటి వరకు బిగ్ బాస్ 5 సీజన్ల‌ను పూర్తి చేసుకుంది. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 6పై దృష్టి పెట్టారు నిర్వాహకులు. ఆగస్టు నెల చివర్లో లేదా సెప్టెంబర్ మొదటివారంలో బిగ్ బాస్ సీజన్ 6 షో ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి.

అయితే ఈ సీజన్ కి అక్కినేని నాగార్జున హోస్ట్ గా ఉండట్లేదని ఆయనే స్వయంగా బిగ్ బాస్ ఓటీటీ ఫైనల్స్ అప్పుడు తెలిపాడు. స్టార్ మా ఛానల్ తో ఆయన చేసుకున్న అగ్రిమెంట్ బిగ్ బాస్ ఓటీటీతోనే ముగిసింది. ఇప్పుడు ఆయన కొన్నిరోజులు బ్రేక్ తీసుకోవడం మంచిది అనే భావనలో ఉన్నారట. నాగార్జున తీసుకున్న ఈ నిర్ణయంతో సీజన్ 6 కోసం వేరే హోస్ట్ ఎవరిని తీసుకోవాలనే ఆలోచనలో పడ్డారట స్టార్ మా టీం. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం నాగార్జున మాజీ కోడలు సమంత బిగ్ బాస్ సీజ‌న్ 6 కి హోస్ట్ గా వ్యవహరించబోతోందని తెలుస్తోంది.

Bigg Boss Telugu 6

ఇక కంటెస్టెంట్స్ విషయానికి వస్తే.. ఈసారి పాల్గొనే కంటెస్టెంట్స్ బుల్లితెర మీద మంచి క్రేజ్ ఉన్నవారేనట. వారిలో ప్రధానంగా వినిపిస్తున్న పేరు సుడిగాలి సుధీర్. ఈయనకి బుల్లితెరపై ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఇందుకోసం సుధీర్ రికార్డు స్థాయి రెమ్యూనరేషన్ ని కూడా స్టార్ మా యాజమాన్యం ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. ఇక సుడిగాలి సుధీర్ తోపాటు యాంకర్ వర్షిణి, దీపికా పిల్లి కూడా ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో లో పాల్గొనబోతున్నట్టు సమాచారం.

వీరితోపాటు స్టార్ మా లో సంచలనం విజయం సాధించిన పాపులర్ సీరియల్ కార్తీక దీపం డాక్టర్ బాబు నిరుపమ్ కూడా ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో లో పాల్గొనబోతున్నట్టు తెలుస్తోంది. అలాగే సీనియర్ యాంకర్ ఉదయ భాను, సీరియల్ హీరోయిన్ నవ్య స్వామి, జబర్దస్త్ కమెడియన్ చమ్మక్ చంద్రతోపాటుగా బిగ్ బాస్ 4 లో టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఒకరిగా నిలిచిన అరియనా కూడా సీజ‌న్ 6 లో మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈసారి సీజ‌న్ 6 లో కేవలం సెలబ్రిటీస్ మాత్రమే కాకుండా.. సామాన్యులకు కూడా కంటెస్టెంట్స్ గా పార్టిసిపేట్ చేసే అవకాశం ఇస్తున్నారు స్టార్ మా యాజమాన్యం. ఇలా ఎన్నో విశేషాలతో రాబోతున్న బిగ్ బాస్ సీజన్ 6 కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

Share
Usha Rani

నా పేరు ఉషారాణి. పుస్తకాలు చదవడం, సినిమాలు చూడడం అంటే ఇష్టం. సాహిత్యంపై నాకు కొంత అవగాహన ఉండడంతో రాయాలి అనే ఆసక్తి పెరిగింది. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ లో కంటెంట్ రైటర్ గా చేస్తున్నాను.

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM