Ram Charan : సినీ ఇండస్ట్రీ మెగా వారసుడిగా పరిచయమై తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిరుత చిత్రంతో వెండితెరపై అడుగు పెట్టి మగధీర, ఎవడు, నాయక్, రంగస్థలం ఇలా ఎన్నో చిత్రాలతో సక్సెస్ ను అందుకుని తెలుగు తెరపై తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. రాజమౌళి ఆర్ఆర్ఆర్ చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. హాలీవుడ్ దర్శకులు సైతం సీతారామరాజు పాత్రలో నటించిన రామ్ చరణ్ పై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురిపించారు.
అంతేకాకుండా చరణ్ తో చిత్రం చేయాలని ఉందనే కోరికను సైతం హాలీవుడ్ డైరెక్టర్లు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. హీరో రామ్ చరణ్ తన కెరియర్ లో 10 చిత్రాలను వదులుకున్నాడు. రామ్ చరణ్ చేతులారా వదులుకున్న ఆ పది చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ ను సాధించాయి. మరి ఆ చిత్రాలు ఏంటంటే.. డార్లింగ్ చిత్ర కథను ముందుగా రామ్ చరణ్ తో దర్శకుడు చర్చలు జరపగా, ఈ చిత్రానికి ప్రభాస్ అయితే బాగుంటుందని రామ్ చరణ్ చెప్పడంతో డార్లింగ్ చిత్ర అవకాశం ప్రభాస్ ని వరించింది.
డార్లింగ్ చిత్రంతో ప్రభాస్ మళ్లీ సక్సెస్ ఫేమ్ లోకి వచ్చి అక్కడ నుంచి తన కెరీర్ లో వెనక్కి తిరిగి చూసుకోలేదు. అదే విధంగా రామ్ చరణ్ వదులుకున్న చిత్రాలు ఏమిటంటే.. దగ్గుబాటి రానా నటించిన లీడర్, కృష్ణం వందే జగద్గురుమ్, సూర్య హీరోగా నటించిన సూర్య సన్ ఆఫ్ కృష్ణన్, న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ఎటో వెళ్ళిపోయింది మనసు, కృష్ణార్జున యుద్ధం, రవితేజ హీరోగా నటించిన నేల టిక్కెట్టు, దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఓకే బంగారం, మహేష్ బాబు హీరోగా నటించిన శ్రీమంతుడు, నాగచైతన్య హీరోగా నటించిన మనం వంటి సినిమాలను రామ్ చరణ్ తన చేతులారా వదులుకున్నారు. చరణ్ రిజెక్ట్ చేసిన ఈ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…