Bigg Boss Telugu 6 : టీవీ షోల్లో తిరుగులేని షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. ఇలాంటి షోలు మొదట విదేశాల్లో ఉండేవి. అక్కడ సూపర్ హిట్ అవ్వడంతో ఇండియాలో ప్రారంభించారు. మొదట నార్త్ లో ఈ షోని ప్రారంభించారు. అక్కడ కూడా మంచి క్రేజ్ సంపాదించడంతో అన్ని దక్షిణాది రాష్ట్రాల్లో బిగ్ బాస్ ని ప్రారంభించారు. ఇప్పటి వరకు బిగ్ బాస్ 5 సీజన్లను పూర్తి చేసుకుంది. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 6పై దృష్టి పెట్టారు నిర్వాహకులు. ఆగస్టు నెల చివర్లో లేదా సెప్టెంబర్ మొదటివారంలో బిగ్ బాస్ సీజన్ 6 షో ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి.
అయితే ఈ సీజన్ కి అక్కినేని నాగార్జున హోస్ట్ గా ఉండట్లేదని ఆయనే స్వయంగా బిగ్ బాస్ ఓటీటీ ఫైనల్స్ అప్పుడు తెలిపాడు. స్టార్ మా ఛానల్ తో ఆయన చేసుకున్న అగ్రిమెంట్ బిగ్ బాస్ ఓటీటీతోనే ముగిసింది. ఇప్పుడు ఆయన కొన్నిరోజులు బ్రేక్ తీసుకోవడం మంచిది అనే భావనలో ఉన్నారట. నాగార్జున తీసుకున్న ఈ నిర్ణయంతో సీజన్ 6 కోసం వేరే హోస్ట్ ఎవరిని తీసుకోవాలనే ఆలోచనలో పడ్డారట స్టార్ మా టీం. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం నాగార్జున మాజీ కోడలు సమంత బిగ్ బాస్ సీజన్ 6 కి హోస్ట్ గా వ్యవహరించబోతోందని తెలుస్తోంది.

ఇక కంటెస్టెంట్స్ విషయానికి వస్తే.. ఈసారి పాల్గొనే కంటెస్టెంట్స్ బుల్లితెర మీద మంచి క్రేజ్ ఉన్నవారేనట. వారిలో ప్రధానంగా వినిపిస్తున్న పేరు సుడిగాలి సుధీర్. ఈయనకి బుల్లితెరపై ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఇందుకోసం సుధీర్ రికార్డు స్థాయి రెమ్యూనరేషన్ ని కూడా స్టార్ మా యాజమాన్యం ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. ఇక సుడిగాలి సుధీర్ తోపాటు యాంకర్ వర్షిణి, దీపికా పిల్లి కూడా ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో లో పాల్గొనబోతున్నట్టు సమాచారం.
వీరితోపాటు స్టార్ మా లో సంచలనం విజయం సాధించిన పాపులర్ సీరియల్ కార్తీక దీపం డాక్టర్ బాబు నిరుపమ్ కూడా ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో లో పాల్గొనబోతున్నట్టు తెలుస్తోంది. అలాగే సీనియర్ యాంకర్ ఉదయ భాను, సీరియల్ హీరోయిన్ నవ్య స్వామి, జబర్దస్త్ కమెడియన్ చమ్మక్ చంద్రతోపాటుగా బిగ్ బాస్ 4 లో టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఒకరిగా నిలిచిన అరియనా కూడా సీజన్ 6 లో మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈసారి సీజన్ 6 లో కేవలం సెలబ్రిటీస్ మాత్రమే కాకుండా.. సామాన్యులకు కూడా కంటెస్టెంట్స్ గా పార్టిసిపేట్ చేసే అవకాశం ఇస్తున్నారు స్టార్ మా యాజమాన్యం. ఇలా ఎన్నో విశేషాలతో రాబోతున్న బిగ్ బాస్ సీజన్ 6 కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.