Bigg Boss : బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో టాప్ రేటింగ్ లో ఉంది. బిగ్ బాస్ హౌస్ లో ఎనిమిది మంది మాత్రమే ఉన్నారు. వీరిలో ఎవరు టాప్ 5 లో ఉంటారనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఈ వారం హౌస్ కెప్టెన్ గా ఉన్న మానస్ కు ఇమ్యూనిటీ ఉండటంతో సేవ్ అవుతాడు. మిగతా కంటెస్టెంట్స్ నామినేషన్ లో ఉన్నారు. వీరిలో సన్నీ, శ్రీరామచంద్ర, యాంకర్ రవి, షణ్ముఖ్, కాజల్ లు సేఫ్ జోన్ లో ఉన్నారు.

సిరి, ప్రియాంక ఓటింగ్ లో వెనుకంజలో ఉన్నారు. ముఖ్యంగా వచ్చే ఎలిమినేషన్స్ లో భాగంగా డేంజర్ జోన్ లో ఉన్న ఈ ఇద్దరిలో ఒకర్ని రక్షించేందుకు బిగ్ బాస్ యూనిట్ మెంబర్స్ ఎవిక్షన్ ఫ్రీ పాస్ ను తీసుకురావచ్చట. అయితే సన్నీ టాస్క్ ల్లో అందర్ని ఎంటర్ టైన్ చేయడంతోపాటు చాలా టఫ్ కాంపిటేషన్ ఇవ్వడంతో అతను ఓ స్పెషల్ పవర్ ని దక్కించుకున్నాడు. అయితే ఈ పవర్ ని తనను తాను రక్షించుకోవడానికి ఉపయోగించుకోవాలని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
ఇక తాజా ఎపిసోడ్స్ లో ఇంటి సభ్యులు వచ్చి కలవడంతో అందరూ హ్యాపీగా ఉన్నారు. మానస్ తల్లి, శ్రీరామచంద్ర సోదరి, సిరి తల్లి వచ్చారు. ఈ క్రమంలో సిరి, షణ్ముఖ్ లు క్లోజ్ గా ఉండటం పట్ల సిరి తల్లి అసహనం వ్యక్తం చేసింది. దీంతో ఆమెకు ఫ్యాన్స్ నుండి నెగెటివిటీ కలిగించేలా చేస్తుందని అనడంలో ఎలాంటి డౌట్ లేదు.
అలాగే నెక్ట్స్ ఎపిసోడ్ లో సన్నీ, రవిల కుటుంబం బిగ్ బాస్ లోకి రావడంతో మరింత సందడిగా మారింది. షణ్ముఖ్ తల్లి కూడా రావడం అతనికి మరింత ప్లస్ అయ్యిందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.