Akhanda : నందమూరి బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్ జంటగా మిరియాల రవీందర్ రెడ్డి నిర్మాణంలో బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన అఖండ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా కోసం నందమూరి అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా డిసెంబర్ 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను ప్రస్తుతం వేగవంతం చేశారు. డిసెంబర్ 2వ తేదీన ఈ సినిమా విడుదల కానుండడంతో నవంబర్ 27 శనివారం సాయంత్రం శిల్పకళావేదికలో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అల్లుఅర్జున్ వస్తున్నారు.
తాజాగా అఖండ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు మరొక ముఖ్య అతిథి రాబోతున్నారు. ఇంతకీ ఆ అతిథి ఎవరు.. అనే విషయానికి వస్తే.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ గా తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి తెలియజేసిన డైరెక్టర్ రాజమౌళి.. బాలయ్య సినిమా అఖండ ప్రీ రిలీజ్ వేడుకలో పాల్గొననున్నారు. ఈ క్రమంలోనే బాలకృష్ణ, రాజమౌళి, అల్లు అర్జున్.. ఒకే వేదికపై కనిపించనున్నారని తెలియడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.