Bigg Boss 5 : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం 80 ఎపిసోడ్‌లు పూర్తి చేసుకుంది. హౌజ్ నుండి 11 మంది సభ్యులు బయటకు వెళ్లగా, ప్రస్తుతం హౌజ్‌లో 8 మంది మాత్రమే ఉన్నారు. తాజా ఎపిసోడ్‌లో ‘నియంత మాటే శాసనం’ అనే టాస్క్ ఇచ్చారు. సైరన్ మోగిన ప్రతిసారీ ఏ సభ్యుడైతే నియంత సింహాసనంపై కూర్చుంటాడో వారు ఆ రౌండ్‌లో సేఫ్ కావడంతోపాటు నియంతగా వ్యవహరిస్తారు.
నియంత ఇచ్చిన ఛాలెంజెస్‌లో చివరిగా నిలిచిన వారి సమస్యను సాల్వ్ చేసి సేవ్ చేయాల్సి ఉంటుంది. తొలి రౌండ్‌లో నియంత సింహాసనాన్ని సిరి దక్కించుకుంది. దీంతో మిగిలిన ఆరుగురికి క్యాప్ హుక్స్ టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్‌లో రవి, సన్నీలు మాత్రమే చివరి రెండు స్థానాల్లో నిలిచారు. సిరి.. రవిని నెక్స్ట్ రౌండ్‌కి ప్రమోట్ చేసి సన్నీకి చెక్ పెట్టింది.
ఇక రెండో రౌండ్‌లో నియంత సింహాసనాన్ని శ్రీరామ్ చేజిక్కించుకున్నాడు. మిగిలిన ఇంటి సభ్యులకి మరో టాస్క్ ఇచ్చారు. కాళ్లకి చెప్పులు ధరించి ఆ చెప్పుల్ని ఎదురుగా ఉన్న గోడపై వీలైనంత ఎత్తులో అతికించాల్సి ఉంటుంది.. ఎవరైతే ఎక్కువ ఎత్తులో ఆ చెప్పుల్ని అతికిస్తారో వాళ్లు సేవ్ అవుతారని.. తక్కువ ఎత్తులో చెప్పుల్ని అతికించిన చివరి ఇద్దరి సభ్యులు నియంతని ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు. ఈ టాస్క్‌లో కాజల్, రవిలు చివరి స్థానాల్లో నిలవగా రవిని సేవ్ చేసిన శ్రీరామ్ కాజల్‌ని డిస్ క్వాలిఫై చేశాడు.
ఇక మూడోసారి యాంకర్ రవి.. నియంత సింహాసనాన్ని దక్కించుకున్నాడు. మిగిలిన ఇంటిసభ్యులకు ఆరెంజ్ టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్‌లో చివరి రెండు స్థానాల్లో నిలిచిన మానస్, షణ్ముఖ్‌లు నియంత రవి దగ్గర పంచాయితీ పెట్టారు. అయితే ఈ ఇద్దర్లో రవి.. షణ్ముఖ్‌ని సేవ్ చేసి మానస్‌ని డిస్ క్వాలిఫై చేశాడు. నాలుగో రౌండ్‌లో ప్రియాంక నియంత సింహాసనాన్ని దక్కించుకుంది. వాటర్ డ్రమ్స్ టాస్క్ ఇవ్వగా ఈ ఛాలెంజ్‌లో షణ్ముఖ్, శ్రీరామ్‌లు చివరి రెండు స్థానాల్లో నిలవడంతో వీళ్లలో షణ్ముఖ్‌ని సేవ్ చేసింది.
ఐదో రౌండ్‌లో భాగంగా.. నియంత సింహాసనంపై కూర్చోవడానికి రవి, షన్నూ, సిరి, ప్రియాంకలు పోటీపడ్డారు. అయితే బజర్ మోగే సమయానికి సిరి, ప్రియాంకలు ఇద్దరూ ఒకేసారి సింహాసనంపై కూర్చున్నారు. అయితే ప్రియాంక కంటే సిరినే ముందు కూర్చున్నట్టుగా విజువల్‌లో కనిపించింది. నేటి ఎపిసోడ్‌లో కెప్టెన్‌గా ఎవర్ని ఎంచుకోవాలో ఇంటి సభ్యుల నిర్ణయానికే వదిలేశారు బిగ్ బాస్.
రాత్రి పడుకునేటప్పుడు సిరికి ఏమైనా పూనకం వస్తుందో ఏమో కానీ.. ఒకే బెడ్‌పై పడుకోవద్దని షణ్ముఖ్ అన్నప్పటి నుంచి సిరి వింత వింతగా ప్రవర్తిస్తూ వస్తోంది. షణ్ముఖ్ పడుకుని ఉంటే అతని పైకి ఎక్కేసి సిరి.. హగ్‌లతో రెచ్చిపోయింది. ఇది చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…